తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన గ్రాఫిక్ మాయాజాలం "ఈగ" సినిమాలోని టైటిల్ సాంగ్ ను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ సాంగ్ ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఈగ (2012)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : దీపు, రాహుల్ సిల్పిగుంజ్, శ్రావణ భార్గవి
దేఖ్‌లోరె సాలా యే రాత్ చాగయి
తేరే ద్వార్ పె తేరీ మౌత్ ఆగయీ..
గయీ గయీ గ..ఈ..గ..ఈగ..ఈగ..ఈగ
మైనేమ్ ఈజ్ నానీ నేనీగనైతే కాని
నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిస్సైల్ని
మైనేమ్ ఈజ్ నానీ నేనీగనైతే కాని
నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిస్సైల్ని
నీ రేంజ్ పెద్దదవనీ నా సైజ్ చిన్నదవనీ
నీ కింగ్‌డంనే కూల్చకుంటే కానురా మగాణ్ణి
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా
అణువంతే ఉన్నా అగ్గిరవ్వలోన
అడవినైనా కాల్చే కసి నిప్పు దాగి లేదా
చిటికంతే అయినా చినుకు బొట్టులోన
పుడమినైనా ముంచే పెను ముప్పు పొంచిలేదా
listen the universe is an atom before the bigbang
ఇల్లలికే ఈగ యే ముఝే క్యా కరేగా
అని యమ కేర్‌ఫ్రీగా నువ్వు ఆవలించేలోగా
నీ శ్వాసలోన దూరిపోనా బయో వైరస్ లాగా...ఆ..ఆ...
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా
యమ అర్జంటుగా పూర్తిచెయ్యవలసిన పనులున్నాయ్
పదే పది.. పదే పది..
వన్.. నిన్ను చంపడం టూ.. నిన్ను చంపడం
త్రీ.. నిన్ను చంపడం ఫోర్.. నిన్ను చంపడం
ఫైవ్.. నిన్ను చంపడం సిక్స్.. నిన్ను చంపడం
సెవెన్.. నిన్ను చంపడం ఎయిట్.. నిన్ను చంపడం
నైన్.. నిన్ను చంపడం టెన్..
నిన్ను ముసిరి ముసిరి ముసిరి ముసిరి
తరిమి తరిమి తరిమి తరిమి
పొడిచి పొడిచి పొడిచి చంపడం
రెపరెపరెపరెప రెక్కలను విదిలిస్తాగా
నీ చెవ్వుల్లోన మరణ రాగ వినిపిస్తాగా
సూసైడ్ బాంబర్‌నై నీ పైకి దూసుకొస్తా
బై హుక్ ఆర్ క్రూక్ నిన్ను చంపి మరోసారి చస్తా
ఒక్కసారి చచ్చినాక ఇంకో చావు లెక్కా
ఇల్లలికే ఈగ యే ముఝే క్యా కరేగా
అని ఆలోచించేలోగా నీ ఆయువున్న జాగా
తగిలబెట్టి ఎగిరిపోనా తారాజువ్వ లాగా...ఆ..ఆ..
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా
2 comments:
హాంటింగ్ సాంగ్..
అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.