ఆదివారం, ఏప్రిల్ 02, 2017

ఒక్కడంటే ఒక్కడే...

విశ్వరూపం చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ పూర్తి సీన్ తమిళ్ వీడియో ఇక్కడ.


చిత్రం : విశ్వరూపం (2013)
సంగీతం : శంకర్ ఎహసాన్ లాయ్
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : సూరజ్ జగన్

ఒక్కడంటే ఒక్కడే ఎక్కడైనా ఒక్కడే
మండుతున్న సూర్యుడే ఈ మగాడి ప్రతిరూపం
రూపం రూపం రూపం
అడ్డు ఆపు చూడడే అంచనాలకందడే
లావా లాంటి తాకిడే ఈ మగాడి ప్రతిరూపం
రూపం రూపం రూపం

ఒదిగితే అణువితడే చెలరేగితే జగమితడే
ఎదిగిన కొలదీ ఎల్లలు దాటే మూడవ అడుగితడే
చెరగని మెరుపితడే భయమెరుగని గెలుపితడే
సమయము చూసి ముప్పును ముంచే
ప్రళయపు ముఖమితడే

ఒక్కడంటే ఒక్కడే ఎక్కడైనా ఒక్కడే
మండుతున్న సూర్యుడే ఈ మగాడి ప్రతిరూపం
రూపం రూపం రూపం
అడ్డు ఆపు చూడడే అంచనాలకందడే
లావా లాంటి తాకిడే ఈ మగాడి ప్రతిరూపం
రూపం రూపం రూపం

విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం

నిప్పుల్లోని తీక్షణై సత్తువున్న లక్ష్యమై
చీకటంత చీల్చుతుంది ఈ మగాడి సొంత రూపం
ఏ క్షణాన ఏ రకం మార్చుతుందో వాలకం
మాటకైన చెప్పదే ఈ మగాడి విశ్వరూపం

ఒదిగితే అణువితడే చెలరేగితే జగమితడే
ఎదిగిన కొలదీ ఎల్లలు దాటే మూడవ అడుగితడే
చెరగని మెరుపితడే భయమెరుగని గెలుపితడే
సమయము చూసి ముప్పును ముంచే
ప్రళయపు ముఖమితడే

రూపం రూపం రూపం
రూపం రూపం రూపం
రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం


4 comments:

ఈ పాట వింటుంటే గూస్పంప్స్..వావ్వ్..

సినిమాలో ఈ సీన్ కూడా అలాగే ఉంటుంది.. వండర్ఫుల్..

ఈ సీన్ కీ ఈ టైటిల్ సాంగ్ ప్రాణం పోసింది

హండ్రడ్ పర్సంట్ ట్రూ అజ్ఞాత గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.