మంగళవారం, ఏప్రిల్ 18, 2017

రామచిలక పెళ్ళికొడుకెవరే...

రామచిలక చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లింక్ ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రామచిలక (1978)
సంగీతం : సత్యం
సాహిత్యం : వేటూరి
గానం : జానకి

రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మంచి రోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే

రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మంచి రోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే

ఏరులాంటి వయసు
ఎల్లువైన మనసు
ఎన్నెలంటి వన్నె చూసిఎవరొస్తారో
ఏరులాంటి వయసు
ఎల్లువైన మనసు
ఎన్నెలంటి వన్నె చూసిఎవరొస్తారో
తుళ్ళిపడకే..కన్నె పువ్వా
తుమ్మెదెవరో రాకముందే
ఈడు కోరే తోడుకోసం
గూడు వెతికే కన్నెమొలక

రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మంచి రోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే

ఊరుదాటే చూపు
చూపు దాటే పిలుపు
ఆరుబైట అందమంతా
ఆరబోసేనే....
ఊరుదాటే చూపు
చూపు దాటే పిలుపు
ఆరుబైట అందమంతా
ఆరబోసేనే..
గోరువంకా..
గోరువంక దారివంక
కోరుకున్న జంట కోసం
ఆశలెన్నో అల్లుకున్న
అంతలోనే ఇంత ఉలుకా

రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మంచి రోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే
రామచిలక పెళ్ళికొడుకెవరే
రామచిలక పెళ్ళికొడుకెవరే


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.