గురువారం, ఏప్రిల్ 06, 2017

ధృవ ధృవ...

ఈ రోజు ధృవ చిత్రంలోని టైటిల్ సాంగ్ తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ధృవ (2016)
సంగీతం : హిప్ హాప్ తమిళ
సాహిత్యం : చంద్రబోస్
గానం : అమిత్ మిశ్రా

అతడే తన సైన్యం
అతడే తన ధైర్యం
తనలో ఆలోచన పేరే
నిశ్శబ్ద ఆయుధం
తన మార్గం యుద్ధం
తన గమ్యం శాంతం
పొంగే తన రక్తం పేరే
పవిత్ర ఆశయం
ధృవ ధృవ 
చెడునంతం చేసే స్వార్ధమే
ధృవ ధృవ
విధినణచే విధ్వంసం
ధృవ ధృవ
విద్రోహము పాలిట ద్రోహమే
ధృవ ధృవ
వెలుగిచ్చే విస్ఫోటం
ఓ...ఓ...ఓ...ఓ...
ధృవ ధృవ 
ఓ...ఓ...ఓ..ఓ..
ధృవ ధృవ
ధృవ ధృవ 

ఆ ధర్మరాజు యమధర్మరాజు ఒకడై
ధృవ ధృవ
కలబోసుకున్న తేజం ధృవ ధృవ 
చాణిక్యుడితడు మరి చంద్రగుప్తుడితడై
ధృవ ధృవ 
చెలరేగుతున్న నైజం ఓహో..ఓఓఓ..
ధృవ ధృవ
నిదురించని అంకిత భావమే
ధృవ ధృవ
నడిచొచ్చే నక్షత్రం
ధృవ ధృవ
శిక్షించే రక్తం శిక్షణే
ధృవ ధృవ
రక్షించే రాజ్యాంగం
ఓ...ఓ...ఓ..ఓ...
ధృవ ధృవ
ఓ...ఓ...ఓ..ఓ..
ధృవ ధృవ


2 comments:

ఈ మూవీ తమిళ్ లో ఇంకా బావుందండీ..విత్ డ్యూ రెస్పెక్ట్స్ టూ రాంచరన్ ఫాన్స్ జయం రవి యాక్షన్ సూపర్బ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-) కానీ చరణ్ కూడా బాగానే కష్టపడ్డాడండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.