శనివారం, నవంబర్ 30, 2019

హరివరాసనం విశ్వమోహనం...

శబరిమల దేవస్థానంలో స్వామివారికి జోలపాటగా ఉపయోగించే ఈ హరివరాసనం పాటతో ఈ సిరీస్ ను ముగిద్దాం. స్వామి అయ్యప్ప చిత్రంలోని ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : స్వామి అయ్యప్ప (1975)
సంగీతం : జి.దేవరాజన్
సాహిత్యం : జె.జె.మాణిక్యం / విశ్వనాథం
గానం : కె.జె.ఏసుదాస్

హరివరాసనం విశ్వమోహనం
హరిదధీస్వరం ఆరాధ్యపాదుకం
అరివిమర్థనం నిత్యనర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా

శరణకీర్తనం శక్తమానసం
భరణలోలుపం నర్తనాలసం
అరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా

కళ మృదుస్మితం సుందరాననం
కళభకోమళం గాత్రమోహనం
కళభకేసరి వాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా

శ్రితజనప్రియం చింతితప్రదం
శృతివిభూషణం సాధుజీవనం
శృతిమనోహరం గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా 


శుక్రవారం, నవంబర్ 29, 2019

ధన్యోహం ఓ శబరీశా...

అయ్యప్ప స్వామి మహత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అయ్యప్పస్వామి మహత్యం (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు 

ధన్యోహం ఓ శబరీశా..
ధన్యోహం ఓ శబరీశా..

ధన్యోహం ఓ శబరీశా
నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశా
నీ శుభరూపం నేటికి చూశా

ఉత్తుంగ శబరిగిరి శృంగ
నిత్య నిస్సంగమంగళాంగ
పంపాతరంగ పుణ్యానుషంగ
మునిహృదయ జలజ భృంగ

ధన్యోహం ఓ శబరీశా
నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశా

బ్రహ్మచారినై భక్తియోగినై
ద్వంద్వము అన్నది వీడి
విగతకామినై మోక్షగామినై
తాపత్రయమును విడిచి
కన్నెసామినై కర్మధారినై
కాలాంబరములు తొడిగి
నీ దరి చేరితి నీలగిరీశా
బంధము తెంచితి పందళవాస

ధన్యోహం ఓ శబరీశా
నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశా

శరణం శరణం భవతరణ
శబరిగిరీశా అయ్యప్ప
శుభదం సుఖదం నీ చరణం
హరిహరపుత్ర అయ్యప్ప
అయనరేఖల సంగమవేళ
మిధ్యావాదపు వధ్యస్థలిలో
శూన్యజగతిలో సూక్ష్మ పరిధిలో
నికరపు వెలుగుల కాంతిపుంజమై
సకలచరాచర సృష్టిదీపమై
మకరజ్యోతిగ వెలిగేది
నీ మహిమ ఒక్కటే అయ్యప్పా
ఈ మహికి దేవుడే అయ్యప్పా

స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే
శబరిగిరీశా ధన్యోహం శబరిగిరీశా ధన్యోహం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం 
 

గురువారం, నవంబర్ 28, 2019

అయ్యప్ప స్వామికి...

అయ్యప్ప దీక్ష చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అయ్యప్పదీక్ష (2006)
సంగీతం : ప్రేమ్
సాహిత్యం : సత్యారెడ్డి
గానం : నిహాల్

స్వామియే శరణం
స్వామియే శరణం 

అయ్యప్ప స్వామికి
అరటి మండపం
కొబ్బరి మువ్వల
పచ్చ తోరణం 
 
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే

హరిహరతనయుడు
అందరి దేవుడు
నీల కంఠుడికి
ప్రియసుతుడతడు 
 
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే

కరిమల వాసుడు
కార్తికేయుడు
జాతి బేధములు
తెలియని వాడు 
 
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే

అంబావాసుడు
పందళ బాలుడు
ఐదు కొండలకు
అధిపతి అతడు 
 
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే

శబరి గిరీశుడు
శంకర తనయుడు
జ్యోతి స్వరూపుడు
భూలోక నాధుడు 

స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
 

బుధవారం, నవంబర్ 27, 2019

చండికే ప్రచండికే...

అయ్యప్ప స్వామి మహత్యం చిత్రంలోని మరో చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అయ్యప్పస్వామి మహత్యం (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు  

చండికే ప్రచండికే
మత్త మహిష ఖండికే
నమోస్తు సింహ కేతనే
చతుర్భుజే త్రిశూలికే
నిశాట ఘోర నాశికే

కాశికా పురేశ్వరీ
కృపాకరీ మహేశ్వరీ
జయాంబికే సుమాత్రుకే
అన్నపూర్ణ నామకే
నమోస్తు జన్మ ధాత్రికే

నమామి భద్ర కాళికాం
కపాలికాం కృపాళికాం
తురంత శత్రు నాశికాం
స్మరామి రుద్ర దీపికాం

చతుర్ధఘట్టే కరిం
కాళికాయే స్మరామి

పంచమ ఘట్టే
భైరవీం ఉపాస్మహే

హరాత్మజం సురావనం
ఫణీంద్ర వంశ వర్ధనం
తం గుహం నమామ్యహం
సుబ్రహ్మణ్య తేజసం

సప్తమే గానలోలం
గంధర్వం స్మరామ్యహం

సహస్ర హస్త శోభితం
తమిశ్రవంశ నాశకం
తమత్రి పుత్ర తాడితం
కార్తవీర్యముపాస్మహే

కృష్ణా భాయ నమః
శృతి బేధకం
కటు శభ్దకం నమామ్యహం

ఏకాదశ ద్వాదశ ఘట్టాయాం
హిడుంబ బేతాళౌ నమామ్యహం

శర్వ కంఠ భూషణం
విశాల పృథ్వి వాహనం
క్షీర జలధి శాయినం
హరిప్రియం నమామ్యహం

అశరీరాం వార్తా హారిణి
కర్ణ పిశాచీం స్మరామ్యహం

సుమాలికా సుగంధినీ
మరంద బింధు తుంబిల
ప్రసూన నిత్య శోభినీ
పుళిందినీ నమోస్తుతే

లభ్ద కామధేనుకాం
మౌని నాథ తారకం
జామదగ్నిఆశ్రమాంత
దీపికాం ప్రదీపికాం
పరుశురామ మాతృకాం
రేణుకాం నమామ్యాహం

అంతిమే స్వప్నవారాహి
ప్రత్యంగిరాయై నమామ్యహం


మంగళవారం, నవంబర్ 26, 2019

హరివరాసనం...

శరణం శరణం శరణం మణికంఠ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శరణం శరణం మణికంఠ (1993)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథం (దేవరాజన్)
సాహిత్యం : (కె.జానకమ్మ-1920)
గానం : ఏసుదాస్

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||

హరివరాసనం స్వామి విశ్వమోహనం |
హరిదధీస్వరం ఆరాధ్యపాదుకం ||
అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||

శరణకీర్తనం స్వామి శక్తమానసం
భరణలోలుపం స్వామి నర్తనాలసం
అరుణభాసురం స్వామి భూతనాయకం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం
ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం
ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||

తురగవాహనం స్వామి సుందరాననం
వరగదాయుధం స్వామి వేదవర్నితం
గురు కృపాకరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

త్రిభువనార్చితం స్వామి దేవతాత్మకం
త్రినయనంప్రభుం స్వామి దివ్యదేశికం
త్రిదశపూజితం స్వామి చింతితప్రదం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||

శ్రితజనప్రియం స్వామి చింతితప్రదం
శృతివిభూషణం స్వామి సాధుజీవనం
శృతిమనోహరం స్వామి గీతలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప || 
 

సోమవారం, నవంబర్ 25, 2019

హరి హర పుత్రా అయ్యప్పా...

అయ్యప్ప చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అయ్యప్ప (2011)
సంగీతం : ఎస్.ఎమ్.ప్రవీణ్
సాహిత్యం :
గానం :

ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
అరుణోదయ సంకాసం
నీలకుండల ధారణం
నీలాంబర ధరం దేవం
వందేహం బ్రహ్మ నందనం
ఓ శ్రీ స్వామియె శరణమయ్యప్పా
శరణం శరాణం శరణం అయ్యప్ప

హరిహర పుత్రా అయ్యప్పా
ఆపద్భాంధవ అయ్యప్పా
నీ పద సన్నిధి చేరుటకై
ఇరుముడి కడితిమి అయ్యప్పా
మహిషి వినాశక అయ్యప్పా
మహిమలు చూపుము అయ్యప్పా
మనసున కొలువై అయ్యప్పా
మము నడిపించుము అయ్యప్పా
శబరిగిరీశా అయ్యప్పా
శుభములనొసగుము అయ్యప్ప
అడుగుల నడిపే అయ్యప్పా
అభయము నీవే అయ్యప్పా
వ్యాఘ్రాధిపతీ అయ్యప్పా
వెతలే తీర్చుము అయ్యప్పా
వెలుగును చూపే అయ్యప్పా
వేకువ కాంతివి నీవప్ప

సర్వము నీవని తలచాము
సతతము నిన్నే కొలిచేము
పూజలు నీకే చేసేము
పాపములన్నీ కడిగేమూ
ఈశ్వర తనయా అయ్యప్పా
మాహిత బంధువు నువ్వప్పా
రక్కసి నీడలు ఛేధించే
రక్షవు నువ్వయ అయ్యప్ప
భక్తిగ నిన్నే పిలిచాము
హృదయములోనే నిలిపాము
మాలలు మేమే వేశాము
మహిమలు ఎన్నో చూశాము
మణికంఠుడవే అయ్యప్పా
మమ్ముల గాచే అయ్యప్పా
మదిలో బాధలు తొలగించే
మందార ప్రియుడవు అయ్యప్పా

గమ్యము నువ్వని బ్రతుకుల్లో
మా ప్రతి గతిని నిలిపాము
దర్శన భాగ్యం పొందుటకై
నిష్టగ నినే చేరేము
శ్రీహరి సుతుడా అయ్యప్పా
సుందర రూపా అయ్యప్పా
సకలము నీవే అయ్యప్పా
శరణము నీవే అయ్యప్పా
నీ కనుచూపుల కరుణల్లో
మా హృదయాలను తడిపావు
మా మది దీపం వెలిగించి
జన్మము ధన్యము చేశావు
గణపతి సోదర అయ్యప్పా
ఘనుడవు నీవే అయ్యప్పా
జగతిని కాచే అయ్యప్పా
ప్రణతులు నీకే అయ్యప్పా

స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం 

 

ఆదివారం, నవంబర్ 24, 2019

శరణాగతి నీవేనయ్యా...

శరణం శరణం మణికంఠ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోఅచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శరణం శరణం మణికంఠ (1993)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథం
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : బాలు

శరణాగతి నీవేనయ్యా
ఇంకా మౌనమేలనయ్యా
నీవే నాదు ప్రాణమన్నా
నిన్నే నమ్మి నేనున్నా

ఓ స్వామి ఈ లీల ఏలయ్యా
నీ మాయ నాటకమింక చాలయ
తలచేనీవేళ రాదా దయా

స్వామి దింతక తోం
అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక
అయ్యప్ప దింతక
స్వామి దింతక తోం

అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం
అయ్యప్ప దింతక
అయ్యప్ప దింతక
స్వామి దింతక తోం

నేనేదో ఆశించానే
నీకు గుడి ఒకటి కట్టించానే
వాడు కాసుల్ని కాజేశాడు
నా ఆశల్ని బలిజేశాడు
నిన్నే నమ్ముకున్నా
మనసమ్ముకున్నా
ఏమి చేయనున్నా
నీ చిత్తమన్నా
వాడు మోసపుచ్చి
మాయ జేయ చూసినా
శ్రీ సన్నిధినే
మోస పుచ్చ చాలునా

స్వామి దింతక తోం
అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక
అయ్యప్ప దింతక
స్వామి దింతక తోం

అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం
అయ్యప్ప దింతక
అయ్యప్ప దింతక
స్వామి దింతక తోం

శరణాగతి నీవేనయ్యా
ఇంకా మౌనమేలనయ్యా
నీవే నాదు ప్రాణమన్నా
నిన్నే నమ్మి నేనున్నా

మూగకిలా మాటిచ్చావు
భక్తి నాలోనా కలిగించావు స్వామి
ఎంత సంతోషం కలిగే మాట
ఇలా ఆగింది సాగే బాట
ఆ మర్మమదేమో
నా కర్మమదేమో
శోధన యో ఇది వేదనయో
నీ గుడి కట్టలేకుంటే ప్రాణమూ
ఇక నీలోనా కావాలి ఐక్యము

స్వామి దింతక తోం
అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక
అయ్యప్ప దింతక
స్వామి దింతక తోం

అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం
అయ్యప్ప దింతక
అయ్యప్ప దింతక
స్వామి దింతక తోం

శరణాగతి నీవేనయ్యా
ఇంకా మౌనమేలయ్యా
నీవే నాదు ప్రాణమన్నా
నిన్నే నమ్మి నేనున్నా


శనివారం, నవంబర్ 23, 2019

కరిమలలో వెలసిన...

అయ్యప్ప చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అయ్యప్ప (2011)
సంగీతం : ఎస్.ఎమ్.ప్రవీణ్
సాహిత్యం :
గానం :

కరిమలలో వెలసిన పెన్నిధివే మా అయ్యప్పా
నియమాలకు దొరికిన సన్నిధివే మా అయ్యప్పా
కరిమలలో వెలసిన పెన్నిధివే మా అయ్యప్పా
నియమాలకు దొరికిన సన్నిధివే మా అయ్యప్పా
దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు వేదభూమిలో అవతరించితివి
నీ మాలనే ధరియింఛగా కరుణించితివా అయ్యప్పా

కరిమలలో వెలసిన పెన్నిధివే మా అయ్యప్ప
నియమాలకు దొరికిన సన్నిధివే మా అయ్యప్పా

విష్ణుతేజమూ వీరశైవమూ
ఒక్క రూపమై ఉద్భవించితివి
పందళరజుకు దత్తపుత్రుడై
ప్రజల మన్ననా పొందినావులే
తండ్రి రాజ్యమును వారసత్వముగ
తాను ఏలుటకు తల్లి ఓర్వదట
పులినే పాలను అడిగి తెమ్మనె
పులినే తెచ్చిన ఘనుడవు నీవట
సురముని వందిత హరిహరి నందన
సుమములు కూర్చుదు స్వామీ

కంఠమాలతో మణిదీపులతో
మణికంఠునిగా పేరుగాంచితివి
అరణ్యమందున బంధిపోటును
హతమార్చుటకై వెళ్ళినావట
నిన్ను చూసినా నిముషమందునే
బందిపోటులో మార్పువచ్చెనట
శరణే వేడుతు చరణం పట్టగా
కనులా గంగతో పాదం కడగగ
అడవుల వచ్చే భక్తుల రక్షణ
వరముగ ఇచ్చిన స్వామి

మహిషి మూలమున మూడు లోకములు
భాధనొందెనని బ్రహ్మ చెప్పగా
కలియుగమ్మున కలత తీర్పగా
మహిషి చంపిన మహితాత్ముడవు
మహిషి శాపము తొలగి పోవగా
లీలా వతిగా నిన్ను వలచెనట
స్వామీ ఏలుకో అనుచూ కోరగా
నీతో పెళ్ళికి ఒకటే నియమము
కన్నెస్వాములిక ఎన్నడు రారో
అదే ముహూర్తము అనెను

భక్తి భావమే మాలధారణము
బంధ విముక్తమె ముక్తి దాయకము
భూమి శయనము ఏక భుక్తము
సాధు సజ్జన నిత్య సంగమము
పాప భారమే నెత్తికెత్తెనట
కళ్ళు ముళ్ళు ఇక కాలిమెత్తలట
నెయ్యి కొబ్బరి చేరి శబరి గిరి
అభిషేకించును హరిహరానందును
జ్యోతి స్వరూపా కాంతి ప్రదీపా
వరములు కురియుము స్వామి.

కరిమలలో వెలసిన పెన్నిధివే మా అయ్యప్పా
నియమాలకు దొరికిన సన్నిధివే మా అయ్యప్పా
దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు వేదభూమిలో అవతరించితివి
నీ మాలనే ధరియింఛగా కరుణించితివా అయ్యప్పా

కరిమలలో వెలసిన పెన్నిధివే మా అయ్యప్ప
నియమాలకు దొరికిన సన్నిధివే మా అయ్యప్పా 


శుక్రవారం, నవంబర్ 22, 2019

ఓం ఓం అయ్యప్ప...

అయ్యప్ప స్వామి మహత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అయ్యప్పస్వామి మహత్యం (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప

సహస్రారమే శబరీ శిఖరం
బ్రహ్మ కపాలం నీ స్థానం
సహస్రారమే శబరీ శిఖరం
బ్రహ్మ కపాలం నీ స్థానం

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

ధనుష్కోటికి ఆది మూలమై
ఉన్నది మూలాధారం
అది గణపతికే ప్రాకారం
ఎరుమేలి యాత్రకే ఆరంభం
శ్రీ కాళహస్తి క్షేత్రం

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

లింగాంగంభుల పానవట్టమే
వెలిగే స్వాధిష్ఠానం
ఇది బ్రహ్మకు మూలస్థానం
కాలైకట్టి అను క్షేత్రం
జంభుకేశ్వరం ఈ తీర్థం

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

అరుణాచలమై వెలిగేది
ఋణపాశాలను త్రెంచేది
పృథ్వి జలమ్ముల దాటినది
నాబి జలజమై వెలిగేది
కలిడుంకుండ్రు అన్న పేరుతో
మణిపూరకమై వెలిసేది

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

హృదయ స్థానం కరిమలా
భక్తుల పాలిటి సిరిమలా
పంచప్రాణముల వాయువులే
శ్వాసనాళముల విలవిల
అనాహతం ఈ కరిమల
అసదృశం ఈ కరిమల
ఓ... ఓ... ఓ...
సాధకులకు ఇది గండశిల

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

నాదోంకార స్వరహారం
శరీరానికొక శారీరం
శబరిపాదమున పంపాతీరం
ఆత్మ విశుద్ధికి ఆధారం
ఆకాశానికి ఆరంభం

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

కనుబొమల మధ్య
ఒక జీవకళా.. ఓం...
అజ్ఞాచక్రపు మిలమిల ఓం...
చర్మ చక్షువులకందని
అవధులూ... ఓం...
సాధించే ఈ శబరిమలా
అదే కాంతిమలా
అదే కాంతిమలా

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప 

 

గురువారం, నవంబర్ 21, 2019

చేతులెత్తి చెంత నిలిచి...

అయ్యప్ప స్వామి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అయ్యప్ప స్వామి  (1975)
సంగీతం : జి.దేవరాజన్
సాహిత్యం : జె.జె.మాణిక్యం / విశ్వనాథం
గానం : సుశీల

చేతులెత్తి చెంత నిలిచి
వేడుకొందు స్వామి
దేవుడని కొలుచుకొని
మొక్కుకొందు స్వామి

స్వర్గలోక దేవతలకు
వరములిచ్చు స్వామి
క్రూరమైన దానవులను
కూల్చివేయు స్వామి
అయ్యప్ప స్వామి
అద్భుత స్వామి

ఇల యందు
రామకృష్ణ లీలలు నీవే
నన్ను కాపాడు
పరమశివుడు విష్ణువు నీవే
ఇల యందు
రామకృష్ణ లీలలు నీవే
నన్ను కాపాడు
పరమశివుడు విష్ణువు నీవే

సకలమును
ఏలుచుండు శక్తివి నీవే
నిను నమ్ము వారి
ఆవేదన చూడవిదేలా
అయ్యప్ప స్వామి
నీవే అద్భుత స్వామి

చేతులెత్తి చెంత నిలిచి
వేడుకొందు స్వామి
దేవుడని కొలుచుకొని
మొక్కుకొందు స్వామి
అయ్యప్ప స్వామి...
అద్భుత స్వామి

అక్క ఉంది చెల్లెలుంది
ఆడిపాడగా
ఒక తమ్ముని
మాకు ప్రసాదించు
వంశమందున
అక్క ఉంది చెల్లెలుంది
ఆడిపాడగా
ఒక తమ్ముని
మాకు ప్రసాదించు
వంశమందున

నడువలేని నాన్న
నిన్ను చూడవచ్చినా
అతడు తోడు వచ్చి
పొందు సుమా నీదు దీవెనా
అయ్యప్ప స్వామి
నీవే అద్భుత స్వామి

చేతులెత్తి చెంత నిలిచి
వేడుకొందు స్వామి
దేవుడని కొలుచుకొని
మొక్కుకొందు స్వామి

స్వర్గలోక దేవతలకు
వరములిచ్చు స్వామి
క్రూరమైన దానవులను
కూల్చి వేయు స్వామి

అయ్యప్ప స్వామి
అద్భుత స్వామి
అయ్యప్ప స్వామి
అద్భుత స్వామి 


బుధవారం, నవంబర్ 20, 2019

స్వామియే శరణమయ్యప్పా...

అయ్యప్ప దీక్ష చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అయ్యప్పదీక్ష (2006)
సంగీతం : ప్రేమ్
సాహిత్యం : సత్యారెడ్డి
గానం : నిహాల్

స్వామియే శరణమయ్యప్పా
అయ్యప్ప దైవమే శరణమయ్యప్పా
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే

ఒన్నాం తిరుపడి శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా
ఓంకారమూర్తియె శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా

రెండాం తిరుపడి శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా
హరిహర తనయా శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా

మూణ్ణాం తిరుపడి శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా
మోహిని తనయా శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా

నాలాం తిరుపడి శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా
నారణ తనయా శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా

అంజాం తిరుపడి శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా
అయ్యప్ప దేవా శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా

ఆరాం తిరుపడి శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా
ఆర్ముగ సోదర శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా

ఏలాం తిరుపడి శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా
ఏకాంత వాసా శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా

ఎట్టాం తిరుపడి శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా
ఎరుమేలి వాసా శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా

ఒంబదాం తిరుపడి శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా
నవగ్రహ నాయక శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా

పత్తాం తిరుపడి శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా
పందళ రాజా శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా

పదినొన్నాం తిరుపడి శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా
పరమదయాళా శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా

పన్నెండాం తిరుపడి శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా
పాపసంహారా శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా

పదిమున్నాం తిరుపడి శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా
పతిత పావనా శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా

పదినాలాం తిరుపడి శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా
పరసుఖ దాయక శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా

పదినెంజాం తిరుపడి శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా
భార్గవ లలితా శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా

పదినారాం తిరుపడి శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా
పరమ పూజిత శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా

పదినేలాం తిరుపడి శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా
పార్వతి తనయా శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా

పదినెట్టాం తిరుపడి శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా
పంచగిరీశా శరణంపొనయ్యప్పా
శరణంపొనయ్యప్పా శరణంపొనయ్యప్పా

స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే

స్వామి దింతక తోం
అయ్యప్ప దింతకతోం
స్వామి దింతక తోం
అయ్యప్ప దింతకతోం
స్వామి దింతక తోం
అయ్యప్ప దింతకతోం
స్వామి దింతక తోం
అయ్యప్ప దింతకతోం


మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రియతమా హృదయమా...

అయ్యప్ప చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అయ్యప్ప (2011)
సంగీతం : ఎస్.ఎమ్.ప్రవీణ్
సాహిత్యం :
గానం : 

ప్రియతమా హృదయమా అయ్యప్పా
జ్యోతికీ నిలయమా అయ్యప్పా
ప్రియతమా హృదయమా అయ్యప్పా
జ్యోతికీ నిలయమా అయ్యప్పా

నీరూపే నిలువెల్ల అణువణువు నిండి
నీ వాడినైనాను చెలిమి కలిమి పొంది
కోరి కొలిచెదను చేరి నిలిచెదను
నిన్నె పిలిచెదను అయ్యప్పా..

ప్రియతమా హృదయమా అయ్యప్పా
జ్యోతికీ నిలయమా అయ్యప్పా

మనవిని వినమని కలవని
ఎదుట నిలచి నిను పిలిచా
హరుడని హరియని కలిసిన
దొరవని తలచి నినుకొలిచా
ఆదుకొనిన స్వామి
నన్నాదుకొనవు ఏమీ
చేదుకొనవ స్వామీ
ఈ భక్తుని సేద తీర్చవేమి
మది హరించుటకు
విధి వరించుటకు
నే తరించుటకు
హరిహర నందుడు
అనుగ్రహించునని
అనునయించునని
శిరసా మనసా వచసా

ప్రియతమా హృదయమా అయ్యప్పా
జ్యోతికీ నిలయమా అయ్యప్పా

చిరు చిరు నగవుల
తొలకరి కనిన ఐతి కన్నెస్వామి
మరి మరి వనముల పదములు
అలిసె తెలిసి రావేమీ
పర్వాలు వంటి పడులు
పదునెనిమిదైన వస్తా
నా గుండె గుడిని చేసి
ఇరుముడిని నేను మోసుకొస్తా
కలవరించు నను కనికరించుమని
కలత తీర్చమని కరిమల సొగసుల
కల్ప తరువుగా కరువు తీరగా
జపమా తపమా వరమా

ప్రియతమా హృదయమా అయ్యప్పా
జ్యోతికీ నిలయమా అయ్యప్పా

నీరూపే నిలువెల్ల అణువణువు నిండి
నీ వాడినైనాను చెలిమి కలిమి పొంది
కోరి కొలిచెదను చేరి నిలిచెదను
నిన్నె పిలిచెదను అయ్యప్పా..

ప్రియతమా హృదయమా అయ్యప్పా
జ్యోతికీ నిలయమా అయ్యప్పా 

 

సోమవారం, నవంబర్ 18, 2019

ముల్లోకాలను చల్లగ చూసే...

స్వామి అయ్యప్ప చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : స్వామి అయ్యప్ప (1975)
సంగీతం : దేవరాజన్
సాహిత్యం : జె.జె.మాణిక్యం, విశ్వనాథం
గానం : పి.బి.శ్రీనివాస్

గురుర్ బ్రహ్మః గురుర్విష్ణుః
గురుర్ దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పర బ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః

ముల్లోకాలను చల్లగ చూసే
దేవుని ధ్యానించు
అతడసహాయులను
అనురాగంతో బ్రోచి దీవించూ

ముల్లోకాలను చల్లగ చూసే
దేవుని ధ్యానించు
అతడసహాయులను
అనురాగంతో బ్రోచి దీవించూ

ముక్తిని కోరు ముని పుంగవుల
భక్తిని శోధించు
తన చరణములంటిన
శరణాగతుల కరుణతొ లాలించు
కరుణతో లాలించూ

ముల్లోకాలను చల్లగ చూసే
దేవుని ధ్యానించు
అతడసహాయులను
అనురాగంతో బ్రోచి దీవించూ

నేలను బ్రతకని జలచరములకు
నీటిని కల్పించు
రెక్కలు విరిగి గిలగిల లాడే
పిట్టల రక్షించూ పిట్టల రక్షించూ

ముల్లోకాలను చల్లగ చూసే
దేవుని ధ్యానించు
అతడసహాయులను
అనురాగంతో బ్రోచి దీవించూ

పలుకే లేక బాధల క్రుంగే
బాలుని కరుణించూ
ఒక వరమే ఇచ్చి మాటాడించి
వేదనల దీర్చూ

ముద్దు బాలుని రూపు ధరించిన
దైవమయ్యప్పా ఒక మూగవానిని
పలికించితివే భ్రాత అయ్యప్పా
ఆ పరమాత్ముని వరపుత్రుడవే
స్వామి అయ్యప్పా
మము ఆదరమ్మున
ఆశీర్వదించు తండ్రి అయ్యప్పా
అయ్యప్పా స్వామి అయ్యప్పా
అయ్యప్పా స్వామి అయ్యప్పా
అయ్యప్పా స్వామి అయ్యప్పా 



 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.