శనివారం, నవంబర్ 02, 2019

కనివిని ఎరుగని ఘనయోగం...

అయ్యప్పస్వామి మహత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అయ్యప్పస్వామి మహత్యం (1989)
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

కనివిని ఎరుగని ఘనయోగం
జగములు ఎరుగని జపమంత్రం
కనివిని ఎరుగని ఘనయోగం
జగములు ఎరుగని జపమంత్రం
ఇంద్రియములనే తలవంచి
ఇరుముడినే తన తలదాల్చి
ఇంద్రియములనే తలవంచి
ఇరుముడినే తన తలదాల్చి
స్వామి శరణం అయ్యప్ప
అని సాగే భక్తుల సందోహం
స్వామి శరణం అయ్యప్ప
అని సాగే భక్తుల సందోహం

స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం

కనివిని ఎరుగని ఘనయోగం
జగములు ఎరుగని జపమంత్రం

శీతల స్నానం తొలి నియమం
భూతల శయనం మలి నియమం
శీతల స్నానం తొలి నియమం
భూతల శయనం మలి నియమం
ఏకభుక్తమే ఉంటూ
నీకు అర్పణం అంటూ
ఏకభుక్తం తవార్పణం
దైహిక భోగం విడిచేది
ఐహిక భోగం మరిచేది
భక్తి ప్రపత్తులు దాటేది
శరణు శరణమని చాటేది

స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం

కనివిని ఎరుగని ఘనయోగం
జగములు ఎరుగని జపమంత్రం

అసితాహార్యం ఒక నియమం
సంసృతి వర్జనమొక నియమం
అసితాహార్యం ఒక నియమం
సంసృతి వర్జనమొక నియమం
అంగదక్షిణే ఇస్తూ ఆత్మదర్శనం చేస్తూ
శాస్త్రారం ప్రణమ్యామహం
మమకారములను విడిచేది
మదమత్సరములు త్రుంచేది
కర్మేఫలముగా తలచేది
తత్‌త్వమ్‌ అసి అని తెలిపేది.

స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం

కనివిని ఎరుగని ఘనయోగం
జగములు ఎరుగని జపమంత్రం
ఇంద్రియములనే తలవంచి
ఇరుముడినే తన తలదాల్చి
స్వామి శరణం అయ్యప్ప
అని సాగే భక్తుల సందోహం

స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం 

 

4 comments:

చాలా అందమైన పాట..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

Sri Ayyappa Swamy Mandala Deeksha samayamlo manchi post chesaru, thank you

థాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ సార్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.