ఆదివారం, నవంబర్ 24, 2019

శరణాగతి నీవేనయ్యా...

శరణం శరణం మణికంఠ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోఅచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శరణం శరణం మణికంఠ (1993)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథం
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : బాలు

శరణాగతి నీవేనయ్యా
ఇంకా మౌనమేలనయ్యా
నీవే నాదు ప్రాణమన్నా
నిన్నే నమ్మి నేనున్నా

ఓ స్వామి ఈ లీల ఏలయ్యా
నీ మాయ నాటకమింక చాలయ
తలచేనీవేళ రాదా దయా

స్వామి దింతక తోం
అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక
అయ్యప్ప దింతక
స్వామి దింతక తోం

అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం
అయ్యప్ప దింతక
అయ్యప్ప దింతక
స్వామి దింతక తోం

నేనేదో ఆశించానే
నీకు గుడి ఒకటి కట్టించానే
వాడు కాసుల్ని కాజేశాడు
నా ఆశల్ని బలిజేశాడు
నిన్నే నమ్ముకున్నా
మనసమ్ముకున్నా
ఏమి చేయనున్నా
నీ చిత్తమన్నా
వాడు మోసపుచ్చి
మాయ జేయ చూసినా
శ్రీ సన్నిధినే
మోస పుచ్చ చాలునా

స్వామి దింతక తోం
అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక
అయ్యప్ప దింతక
స్వామి దింతక తోం

అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం
అయ్యప్ప దింతక
అయ్యప్ప దింతక
స్వామి దింతక తోం

శరణాగతి నీవేనయ్యా
ఇంకా మౌనమేలనయ్యా
నీవే నాదు ప్రాణమన్నా
నిన్నే నమ్మి నేనున్నా

మూగకిలా మాటిచ్చావు
భక్తి నాలోనా కలిగించావు స్వామి
ఎంత సంతోషం కలిగే మాట
ఇలా ఆగింది సాగే బాట
ఆ మర్మమదేమో
నా కర్మమదేమో
శోధన యో ఇది వేదనయో
నీ గుడి కట్టలేకుంటే ప్రాణమూ
ఇక నీలోనా కావాలి ఐక్యము

స్వామి దింతక తోం
అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక
అయ్యప్ప దింతక
స్వామి దింతక తోం

అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం
అయ్యప్ప దింతక
అయ్యప్ప దింతక
స్వామి దింతక తోం

శరణాగతి నీవేనయ్యా
ఇంకా మౌనమేలయ్యా
నీవే నాదు ప్రాణమన్నా
నిన్నే నమ్మి నేనున్నా


2 comments:

ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.