గురువారం, నవంబర్ 07, 2019

ఓంకార రూపాన...

ఆవిడే శ్యామల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆవిడే శ్యామల (1997)
సంగీతం : మాధవపెద్ది సురేష్
సాహిత్యం : డి.నారాయణ వర్మ
గానం : కె.జె.ఏసుదాస్  

ఓం కార రూపాన శబరిమల శిఖరాన
కొలువున్న అయ్యప్ప దీక్ష
ఓం కార రూపాన శబరిమల శిఖరాన
కొలువున్న అయ్యప్ప దీక్ష

శార్దూల వాహనుడు
మణికంఠ మోహనుడు
కరుణించి కావగ దీక్ష
నియమాల మాలతో దీక్ష

ఓంకార రూపాన శబరిమల శిఖరాన
కొలువున్న అయ్యప్ప దీక్ష

కామము క్రోధము లోభాలు కరిగించు
నెయ్యాభిషేకాల దీక్ష
కామము క్రోధము లోభాలు కరిగించు
నెయ్యాభిషేకాల దీక్ష
శాంత స్వభావాలు సౌఖ్యాలు కలిగించు
మండలపు పూజల దీక్ష
ఓ దర్మ శాస్త ఓ అభయ హస్త
ఇహపరము తరయించు
ముక్తి ఫల దీక్ష

స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప

అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగా
అయ్యప్ప కనిపించు యాత్ర
అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగా
అయ్యప్ప కనిపించు యాత్ర
పదునెనిమిది మెట్లు ఎక్కగా మొక్కగా
కోట్లాది పాదముల యాత్ర
పంబనది యాత్ర పరమాత్మ యాత్ర
ఇడుములను బాపగా ఇరుముడుల యాత్ర

స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప

ఓం కార రూపాన శబరిమల శిఖరాన
కొలువున్న అయ్యప్ప దీక్ష
శార్దూల వాహనుడు
మణికంఠ మోహనుడు
కరుణించి కావగ దీక్ష
నియమాల మాలతో దీక్ష

స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప


2 comments:

ఈ మూవీలో ఈ పాటొక్కటే బావుంటుంది..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.