బుధవారం, నవంబర్ 13, 2019

మాల ధారణం...

అయ్యప్ప స్వామి మహత్యం చిత్రంలోని ఒక అద్భుతమైన పాటను ఈ రోజు తలచుకుందాం. నాకు చాలా ఇష్టమైన పాట ఇది. వేటూరి వారి ప్రతిభను కళ్ళకు కట్టే సాహిత్యానికి మహదేవన్ గారి సంగీతం తోడై భక్తి పారవశ్యంలోకి అలవోకగా తీస్కెళుతుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అయ్యప్పస్వామి మహత్యం (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు  

మాల ధారణం నియమాల తోరణం
మాల ధారణం నియమాల తోరణం
జన్మ తారణం దుష్కర్మ వారణం
జన్మ తారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం

మాల ధారణం నియమాల తోరణం
మాల ధారణం నియమాల తోరణం

ఉదయాస్తమ్ముల సంధ్యలలో
పురుషార్ధత్రయ సాధనలో
చతుర్వేదముల రక్షణలో
పంచభూతముల పంజర శుకమై
ఆరు శత్రువుల ఆరడిలో పడి
ఏడు జన్మలకు వీడని తోడని
నిన్ను నమ్మిన నీ నిజభక్తులా

మాల ధారణం నియమాల తోరణం
జన్మ తారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం

ఆ ఉ మా సంగమనాదంలో
ఓం ఓం ఓం ఓం
హరిహరరూపా అద్వైతంలో
శరణం శరణం శరణం శరణం
ఆ ఉ మా సంగమనాదంలో
హరిహరరూపాద్వైతంలో
నిష్ఠుర నిగ్రహ యోగంలో
మండలపూజా మంత్ర ఘోషలో
కర్మ అన్న కర్పూరం కరిగే
కర్మ అన్న కర్పూరం కరిగే
ఆత్మహారతులు పట్టిన భక్తులా

మాల ధారణం నియమాల తోరణం
జన్మ తారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం

శరణమయ్యప్పా.. అయ్యప్పా శరణం
శరణమయ్యప్పా.. అయ్యప్పా శరణం
మాల ధారణం నియమాల తోరణం
జన్మ తారణం దుష్కర్మ వారణం
మాల ధారణం నియమాల తోరణం


4 comments:

thank you for posting this song lyrics, regards

థాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ వేటూరి గారు..

ఈ పాట వింటుంటే స్వామి కనుల ముందు కనిపిస్తారు..

నిజమండీ.. అద్భుతమైన పాట.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.