శుక్రవారం, నవంబర్ 08, 2019

శబరిమలను స్వర్ణ...

స్వామి అయ్యప్ప చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో సరిగమ యూట్యూబ్ ఛానల్ లో ఇక్కడ వినవచ్చు, ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : స్వామి అయ్యప్ప (1975)
సంగీతం : దేవరాజన్
సాహిత్యం : జె.జె.మాణిక్యం, విశ్వనాథం
గానం : కె.జె.ఏసుదాస్

శబరిమలను స్వర్ణ చంద్రోదయం
ధర్మ రక్షకుని సన్నిధిని అభిషేకం
లోకాల గారవించు అయ్యప్ప స్తోత్రం
భక్తితో పాడుకుంటాం హృదయములా

శబరిమలను స్వర్ణ చంద్రోదయం
ధర్మ రక్షకుని సన్నిధిని అభిషేకం
లోకాల గారవించు అయ్యప్ప స్తోత్రం
భక్తితో పాడుకుంటాం హృదయములా

శబరిమలను స్వర్ణ చంద్రోదయం

ప్రీతియే ఉల్లమున పాలగును
అదే చల్లని నీ ఎదను పెరుగౌను
వెన్నయే నీవిచ్చు అనురాగం
నీకు నెయ్యభిషేకమునే జరిపిస్తాం

నీజాడలలో నడిచే జీవులమయ్యప్పా
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదమయ్యప్పా
అయ్యప్పా.. శరణమయ్యప్పా
అయ్యప్పా.. శరణమయ్యపా

శబరిమలను స్వర్ణ చంద్రోదయం

పుణ్యమిచ్చే పన్నీరభిషేకం
జనులు భక్తితో చేసెడి పాలభిషేకం
దివ్య పంచామృతాన అభిషేకం
నీదు తనువంత జ్యోతివలె వెలిగేనూ

నీజాడలలో నడిచే జీవులమయ్యప్పా
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా
అయ్యప్పా.. శరణమయ్యప్పా..
అయ్యప్పా.. శరణమయ్యపా..

శబరిమలను స్వర్ణ చంద్రోదయం

దోసిట పుణ్య జలం అందుకొని
అదే నీ పేరు స్తుతియించి శిరసునుంచి
కరుగు విభూతితో అభిషేకం
హరి ఓం అని చందనంతో అభిషేకం

నీ జాడలలో నడిచే జీవులమయ్యప్పా
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా
అయ్యప్పా.. శరణమయ్యప్పా
అయ్యప్పా.. శరణమయ్యపా

శబరిమలను స్వర్ణ చంద్రోదయం
ధర్మ రక్షకుని సన్నిధిని అభిషేకం
లోకాల గారవించు అయ్యప్ప స్తోత్రం
భక్తితో పాడుకుంటాం హృదయములా

అయ్యప్పా.. శరణం అయ్యప్పా
అయ్యప్పా.. శరణం అయ్యప్పా
అయ్యప్పా.. శరణం అయ్యప్పా 



4 comments:

నెయ్యభిషేకమునే జరిపిస్తాం.very good song

థాంక్స్ అజ్ఞాత గారు. కరెక్టెడ్..

ఈ పాట యెప్పుడు విన్నా మనసంతా అయ్యప్ప రూపంతో నిండి పోతుంది..

అవునండీ ట్యూన్ చాలా బావుంటుంది.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.