సోమవారం, నవంబర్ 18, 2019

ముల్లోకాలను చల్లగ చూసే...

స్వామి అయ్యప్ప చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : స్వామి అయ్యప్ప (1975)
సంగీతం : దేవరాజన్
సాహిత్యం : జె.జె.మాణిక్యం, విశ్వనాథం
గానం : పి.బి.శ్రీనివాస్

గురుర్ బ్రహ్మః గురుర్విష్ణుః
గురుర్ దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పర బ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః

ముల్లోకాలను చల్లగ చూసే
దేవుని ధ్యానించు
అతడసహాయులను
అనురాగంతో బ్రోచి దీవించూ

ముల్లోకాలను చల్లగ చూసే
దేవుని ధ్యానించు
అతడసహాయులను
అనురాగంతో బ్రోచి దీవించూ

ముక్తిని కోరు ముని పుంగవుల
భక్తిని శోధించు
తన చరణములంటిన
శరణాగతుల కరుణతొ లాలించు
కరుణతో లాలించూ

ముల్లోకాలను చల్లగ చూసే
దేవుని ధ్యానించు
అతడసహాయులను
అనురాగంతో బ్రోచి దీవించూ

నేలను బ్రతకని జలచరములకు
నీటిని కల్పించు
రెక్కలు విరిగి గిలగిల లాడే
పిట్టల రక్షించూ పిట్టల రక్షించూ

ముల్లోకాలను చల్లగ చూసే
దేవుని ధ్యానించు
అతడసహాయులను
అనురాగంతో బ్రోచి దీవించూ

పలుకే లేక బాధల క్రుంగే
బాలుని కరుణించూ
ఒక వరమే ఇచ్చి మాటాడించి
వేదనల దీర్చూ

ముద్దు బాలుని రూపు ధరించిన
దైవమయ్యప్పా ఒక మూగవానిని
పలికించితివే భ్రాత అయ్యప్పా
ఆ పరమాత్ముని వరపుత్రుడవే
స్వామి అయ్యప్పా
మము ఆదరమ్మున
ఆశీర్వదించు తండ్రి అయ్యప్పా
అయ్యప్పా స్వామి అయ్యప్పా
అయ్యప్పా స్వామి అయ్యప్పా
అయ్యప్పా స్వామి అయ్యప్పా 



 

2 comments:

చాలా చాలా ఇష్టమైన పాటిది..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.