అయ్యప్ప స్వామి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అయ్యప్ప స్వామి (1975)
సంగీతం : జి.దేవరాజన్
సాహిత్యం : జె.జె.మాణిక్యం / విశ్వనాథం
గానం : సుశీల
చేతులెత్తి చెంత నిలిచి
వేడుకొందు స్వామి
దేవుడని కొలుచుకొని
మొక్కుకొందు స్వామి
స్వర్గలోక దేవతలకు
వరములిచ్చు స్వామి
క్రూరమైన దానవులను
కూల్చివేయు స్వామి
అయ్యప్ప స్వామి
అద్భుత స్వామి
ఇల యందు
రామకృష్ణ లీలలు నీవే
నన్ను కాపాడు
పరమశివుడు విష్ణువు నీవే
ఇల యందు
రామకృష్ణ లీలలు నీవే
నన్ను కాపాడు
పరమశివుడు విష్ణువు నీవే
సకలమును
ఏలుచుండు శక్తివి నీవే
నిను నమ్ము వారి
ఆవేదన చూడవిదేలా
అయ్యప్ప స్వామి
నీవే అద్భుత స్వామి
చేతులెత్తి చెంత నిలిచి
వేడుకొందు స్వామి
దేవుడని కొలుచుకొని
మొక్కుకొందు స్వామి
అయ్యప్ప స్వామి...
అద్భుత స్వామి
అక్క ఉంది చెల్లెలుంది
ఆడిపాడగా
ఒక తమ్ముని
మాకు ప్రసాదించు
వంశమందున
అక్క ఉంది చెల్లెలుంది
ఆడిపాడగా
ఒక తమ్ముని
మాకు ప్రసాదించు
వంశమందున
నడువలేని నాన్న
నిన్ను చూడవచ్చినా
అతడు తోడు వచ్చి
పొందు సుమా నీదు దీవెనా
అయ్యప్ప స్వామి
నీవే అద్భుత స్వామి
చేతులెత్తి చెంత నిలిచి
వేడుకొందు స్వామి
దేవుడని కొలుచుకొని
మొక్కుకొందు స్వామి
స్వర్గలోక దేవతలకు
వరములిచ్చు స్వామి
క్రూరమైన దానవులను
కూల్చి వేయు స్వామి
అయ్యప్ప స్వామి
అద్భుత స్వామి
అయ్యప్ప స్వామి
అద్భుత స్వామి
2 comments:
అయ్యప్ప స్వామి..
నీవే అద్భుత స్వామి..
నమో నమః..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.