శనివారం, నవంబర్ 23, 2019

కరిమలలో వెలసిన...

అయ్యప్ప చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అయ్యప్ప (2011)
సంగీతం : ఎస్.ఎమ్.ప్రవీణ్
సాహిత్యం :
గానం :

కరిమలలో వెలసిన పెన్నిధివే మా అయ్యప్పా
నియమాలకు దొరికిన సన్నిధివే మా అయ్యప్పా
కరిమలలో వెలసిన పెన్నిధివే మా అయ్యప్పా
నియమాలకు దొరికిన సన్నిధివే మా అయ్యప్పా
దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు వేదభూమిలో అవతరించితివి
నీ మాలనే ధరియింఛగా కరుణించితివా అయ్యప్పా

కరిమలలో వెలసిన పెన్నిధివే మా అయ్యప్ప
నియమాలకు దొరికిన సన్నిధివే మా అయ్యప్పా

విష్ణుతేజమూ వీరశైవమూ
ఒక్క రూపమై ఉద్భవించితివి
పందళరజుకు దత్తపుత్రుడై
ప్రజల మన్ననా పొందినావులే
తండ్రి రాజ్యమును వారసత్వముగ
తాను ఏలుటకు తల్లి ఓర్వదట
పులినే పాలను అడిగి తెమ్మనె
పులినే తెచ్చిన ఘనుడవు నీవట
సురముని వందిత హరిహరి నందన
సుమములు కూర్చుదు స్వామీ

కంఠమాలతో మణిదీపులతో
మణికంఠునిగా పేరుగాంచితివి
అరణ్యమందున బంధిపోటును
హతమార్చుటకై వెళ్ళినావట
నిన్ను చూసినా నిముషమందునే
బందిపోటులో మార్పువచ్చెనట
శరణే వేడుతు చరణం పట్టగా
కనులా గంగతో పాదం కడగగ
అడవుల వచ్చే భక్తుల రక్షణ
వరముగ ఇచ్చిన స్వామి

మహిషి మూలమున మూడు లోకములు
భాధనొందెనని బ్రహ్మ చెప్పగా
కలియుగమ్మున కలత తీర్పగా
మహిషి చంపిన మహితాత్ముడవు
మహిషి శాపము తొలగి పోవగా
లీలా వతిగా నిన్ను వలచెనట
స్వామీ ఏలుకో అనుచూ కోరగా
నీతో పెళ్ళికి ఒకటే నియమము
కన్నెస్వాములిక ఎన్నడు రారో
అదే ముహూర్తము అనెను

భక్తి భావమే మాలధారణము
బంధ విముక్తమె ముక్తి దాయకము
భూమి శయనము ఏక భుక్తము
సాధు సజ్జన నిత్య సంగమము
పాప భారమే నెత్తికెత్తెనట
కళ్ళు ముళ్ళు ఇక కాలిమెత్తలట
నెయ్యి కొబ్బరి చేరి శబరి గిరి
అభిషేకించును హరిహరానందును
జ్యోతి స్వరూపా కాంతి ప్రదీపా
వరములు కురియుము స్వామి.

కరిమలలో వెలసిన పెన్నిధివే మా అయ్యప్పా
నియమాలకు దొరికిన సన్నిధివే మా అయ్యప్పా
దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు వేదభూమిలో అవతరించితివి
నీ మాలనే ధరియింఛగా కరుణించితివా అయ్యప్పా

కరిమలలో వెలసిన పెన్నిధివే మా అయ్యప్ప
నియమాలకు దొరికిన సన్నిధివే మా అయ్యప్పా 


2 comments:

అయ్యప్ప స్వామి మూవీస్ లో ఈ మూవీ చూడలేదు..నైస్ సాంగ్..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.