శ్వేత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్వేత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, అక్టోబర్ 12, 2017

నువ్వేలే నువ్వేలే...

జయ జానకీ నాయకా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తి పాట లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జయజానకీనాయకా (2017)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : చంద్రబోస్
గానం : శ్వేతా మోహన్

నువ్వేలే నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన
నేస్తం నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన
స్నేహం నువ్వేలే 

నడవలేని చోటులోన
పూల బాట నువ్వేలే
నిదురలేని జీవితాన
జోల పాట నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన
నేస్తం నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన
స్నేహం 

నువ్వేలే
 
మేఘాలెన్నున్నా ఆకాశం నువ్వేలే
రాగాలెన్నున్నా అనురాగం నువ్వేలే
బంధాలెన్నున్నా ఆనందం నువ్వేలే
కష్టాలెన్నున్నా అదృష్టం నువ్వేలే
అలసి ఉన్న గొంతులోన
మనసు మాట నువ్వేలే
అడవిలాంటి గుండెలోన
తులసికోట నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన
నేస్తం నువ్వేలే
నువ్వేలే నువ్వేలే
నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన
స్నేహం నువ్వేలే

 
దైవా
లెన్నున్నా నా ధైర్యం నువ్వేలే
స్వర్గా
లెన్నున్నా నా సొంతం నువ్వేలే
దీపా
లెన్నున్నా నా కిరణం నువ్వేలే
ఆభరణా
లెన్నున్నా నా తిలకం మాత్రం నువ్వేలే
మధురమైన భాషలోన
మొదటి ప్రేమ నువ్వేలే
మరణమైన ఆశలోన
మరొక జన్మ నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన
నేస్తం నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన
స్నేహం నువ్వేలే 
 

శుక్రవారం, ఫిబ్రవరి 10, 2017

కుచ్చి కుచ్చి కూనమ్మా

టెడ్డీ డే సంధర్బంగా ప్రేమికులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బొంబాయి (1995)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం : వేటూరి
గానం : హరిహరన్, జి.వి.ప్రకాష్, శ్వేత, స్వర్ణలత

కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు
కుందనాల కూనమ్మా పిల్లనివ్వు
ఊరువాడా నిద్దరోయె కోడి కూడా సద్దు చేసె
కుచ్చి కుచ్చి కూనమ్మా.
కుందనాల కూనమ్మా.

కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు
ఏ కుందనాల కూనమ్మా పిల్లనివ్వు
ఊరువాడా నిద్దరోయె కోడి కూడా సద్దు చేసె
కుచ్చి కుచ్చి కూనమ్మా.
కుందనాల కూనమ్మా.

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేసమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేసమింక చాలు వెళ్ళమంట

ఆట నెమలికి మెరుపు సుఖం
గాన కోకిలకు పిలుపు సుఖం
చెట్టు వేరుకు పాదు సుఖం ఏ.
అమ్మనాన్న పిలుపు సుఖం

రాకుమారుడికి గెలుపు సుఖం
చంటి కడుపుకి పాలు సుఖం
మొగుడు శ్రీమతి అలకలలు
ముద్దు కన్నా ముడుపు సుఖం

రేయిపగలు పన్నీట్లో ఉన్నా
రాదు మేనికి చలికాలం
అల్లిబిల్లిగా లాలిస్తుంటే
గారాల పూబాల కోరేది సరసం
బుజ్జి బుజ్జి పాపనివ్వు
పోకిరాట వేషమొద్దు
ఆ.ఆ... బుజ్జి బుజ్జి పాపనివ్వు
పోకిరాట వేషమొద్దు
వేడెక్కే అందాల పెట్టు
వేదిస్తే నా మీదే ఒట్టు

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేసమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేసమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా.
కుందనాల కూనమ్మా.

చిరుత రెక్కలే పక్షివిలే
చిటెకె వెలుగులే దివ్వెవిలే
తోడు నీడ ఇక నీవేలే
తరగని పున్నమిలే
తనువుతోటివే తపనలులే
ఉరుముతోటివే మెరుపులులే
ఉన్నతోడు ఇక నీవేలే
విలువలు తెలియవులే
భూమి తిరగడం నిలబడితే
భువిని తాళమే మారదులే
మగని ఆదరణ కరువైతే
ఇల్లాలి ప్రేమంతా వేసంగిపాలె

పొత్తు కోరుకున్న ఆశ
అంటుకుంది అగ్గిలాగ
పొత్తు కోరుకున్న ఆశ
అంటుకుంది అగ్గిలాగ
బుద్దిగుంటే మంచిదంట
దూరాలు కోరింది జంట

కుచ్చి కుచ్చి కూనమ్మా.
కుందనాల కూనమ్మా.

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేసమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేసమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా.


శుక్రవారం, జులై 22, 2016

దిల్ సే దిల్ సే నీ ఊహల్లో...

గబ్బర్ సింగ్ చిత్రంలోని ఒక హుషారైన గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : గబ్బర్ సింగ్ (2012)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : కార్తీక్, శ్వేతా మోహన్

దిల్ సే దిల్ సే నీ ఊహల్లో
ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో
కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో
తొలి తొలి చూపుల మాయా
తొలకరిలో తడిసిన హాయా
తనువున తకదిమి చూశా ఓ ప్రియా
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే

దిల్ సే దిల్ సే నీ ఊహల్లో
ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో

నా గుండెలోన మ్యాండొలిన్ మోగుతున్నదే
ఒళ్ళు తస్సదియ్య స్ప్రింగు లాగ ఊగుతున్నదే
ఓ.. సనమ్ నాలో సగం
పైట పాలపిట్ట గుంపులాగ ఎగురుతున్నదే
లోన పానిపట్టు యుద్ధమేదొ జరుగుతున్నదే
నీ.. వశం నేనే కసమ్
పిల్లి కళ్ళ చిన్నదాన్ని మళ్ళి మళ్ళి చూసి
వెల్లకిల్ల పడ్డ ఈడు ఈల వేసే
కల్లు తాగి కోతిలాగ పిల్లిమొగ్గలేసే
 
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే

రెండు కళ్ళలోన కార్నివల్ జరుగుతున్నదే
వింత హాయి నన్ను వాలీబాల్ ఆడుతున్నదే
ఈ.. సుఖం అదో.. రకం
బుగ్గ పోస్టుకార్డు ముద్దు ముద్దరెయ్యమన్నదే
లేకపోతె సిగ్గు ఊరుదాటి వెళ్లనన్నదే
ఈ.. క్షణం నిరీక్షణం
హే.. చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినావే

చుక్క వేసుకున్న ఇంత కిక్కు రాదే
లబ్ డబ్ మాని గుండె ఢంఢనాక ఆడే.. హో..
 
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే

దిల్ సే దిల్ సే నీ ఊహల్లో
ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో
కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో హో..

 

గురువారం, జులై 21, 2016

మెల మెల్లగా చిగురించెనే...

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం కోసం రమణ గోగుల స్వరపరచిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : వెంకటాద్రిఎక్స్ ప్రెస్ (2013)
సంగీతం : రమణగోగుల
సాహిత్యం : కాసర్ల శ్యామ్
గానం : శ్వేతా మోహన్, అంజనా సౌమ్య

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా
మరుమల్లెలా వికసించెనే
ఎదలోతులో ఈ కలయికా

పెదవంచులుదాటి మౌనమే దిగివచ్చెను నేలా
పొగమంచును మీటినా కిరణమే తెచ్చెను హాయిలా
నిలువెల్లా నిండిపోయెనే నువ్వేనేనులా

ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా

అనుకోని తీరమైనా నిను నేను చేరనా
చిరుగాలి తాకుతున్నా చిగురాకులా
ననుచూసి ఇలా నాక్కూడా కొత్తగ ఉందికదా
కలకాదు కదా నీ వెంట ఉన్నది నేనేగా

ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా

మెరుపల్లె చేరువైతే చినుకల్లె మారనా
నీలోన నేనుకరిగీ పులకించనా
నీకోసమిలా కదిలేటి నిముషమునాపేస్తా
నీతోడుఅలా సాగేటి కాలమె నేనౌతా

ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా

 

ఆదివారం, ఆగస్టు 23, 2015

ఎలా ఎలా ఎలా...

యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కని మెలోడీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పంజా (2011)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : చంద్రబోస్
గానం : హరిహరన్, శ్వేతా పండిట్

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయం లోన పొందా జన్మ మరలా

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా

నిన్నలోని నిమిషమైన గురుతు రాదే ఈక్షణం
నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే భాష చాల్లెదేలా

నా భాషలోన తీయ్యందనం
నా బాటలోన పచ్చందనం
పసి పాపలాగా నవ్వే గుణం
నీ వల్లే నీ వల్లే వెలిగింది నా నీడ నీ నీడలోనే చేరాలని
నూరేళ్ళ పయనాలు చేయాలని
ఈ పరవశం లోన నిలిచా ప్రాణ శిలలా

ఎలా ఎలా ఎలా ఎలా
నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయం లోన పొందా జన్మ మరలా
 
I wanna hold you
I wanna hold you in my heart
I wanna hold you
I wanna hold you in my heart


గురువారం, మార్చి 13, 2014

పున్నమి పున్నమి వెన్నెల

ఇటీవల వచ్చిన పాటలలో ఓ మంచి మెలొడి ఇది, చిత్రీకరణ కూడా చిత్రంగా ఉంటుంది మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : లవ్ జర్నీ(2012)
సంగీతం : సతీష్ చక్రవర్తి
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : విజయ్ ఏసుదాస్, శ్వేత
 
పున్నమి పున్నమి వెన్నెల నా చెలి
పువ్వులు పూచిన నవ్వే నా చెలి
చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..
ఎందరొ ఎందరొ ప్రేమికులున్నా
ఎన్నో ఎన్నో కలలను కన్నా
ప్రాణం ఇచ్చే ప్రేమే నాదీ ఓఓఓఓ

వెన్నెల వెన్నెల నిన్నే పిలిచెను
కన్నులు కన్నులు నేడే కలిసెను
కలలివి కలలివి అలలై ఎగసెను
ఆశల గువ్వలు నింగిని తాకెను

పున్నమి పున్నమి వెన్నెల నా చెలి
పువ్వులు పూచిన నవ్వే నా చెలి
చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..

కావ్యాల్లాంటీ కథలను ఎన్నో భూమే చూసినది
నా ఎద కోరే మన కథ కూడా చరితై ఉండమనీ..
నీ ఎదకన్నా స్వర్గం లేదని నిన్నే కోరి వచ్చాను వచ్చాను
ప్రేమకు నువ్వే రూపం అనుకుని నామది నీకే ఇచ్చాను ఇచ్చాను

పున్నమి పున్నమి వెన్నెల నా చెలి
పువ్వులు పూచిన నవ్వే నా చెలి
చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..

ఏవో కలలే అలలై వచ్చీ తీరం చేరినవీ..
ఏవో కథలే ఎదనే గిచ్చీ విరహం పెంచినవీ
నింగిని వీడి నేలకు వచ్చి వెన్నెల నిన్నే చేరింది చేరింది
ఆశలు తీరే ఆమని లాగా బతుకే నేడు మారింది మారింది

పున్నమి పున్నమి వెన్నెల నా చెలి
పువ్వులు పూచిన నవ్వే నా చెలి
చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..

వెన్నెల వెన్నెల నిన్నే పిలిచెను
కన్నులు కన్నులు నేడే కలిసెను
కలలివి కలలివి అలలై ఎగసెను
ఆశల గువ్వలు నింగిని తాకెను

పున్నమి పున్నమి వెన్నెల నీ చెలి
పువ్వులు పూచిన నవ్వే నీ చెలి
చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.