గురువారం, అక్టోబర్ 12, 2017

నువ్వేలే నువ్వేలే...

జయ జానకీ నాయకా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తి పాట లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జయజానకీనాయకా (2017)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : చంద్రబోస్
గానం : శ్వేతా మోహన్

నువ్వేలే నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన
నేస్తం నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన
స్నేహం నువ్వేలే 

నడవలేని చోటులోన
పూల బాట నువ్వేలే
నిదురలేని జీవితాన
జోల పాట నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన
నేస్తం నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన
స్నేహం 

నువ్వేలే
 
మేఘాలెన్నున్నా ఆకాశం నువ్వేలే
రాగాలెన్నున్నా అనురాగం నువ్వేలే
బంధాలెన్నున్నా ఆనందం నువ్వేలే
కష్టాలెన్నున్నా అదృష్టం నువ్వేలే
అలసి ఉన్న గొంతులోన
మనసు మాట నువ్వేలే
అడవిలాంటి గుండెలోన
తులసికోట నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన
నేస్తం నువ్వేలే
నువ్వేలే నువ్వేలే
నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన
స్నేహం నువ్వేలే

 
దైవా
లెన్నున్నా నా ధైర్యం నువ్వేలే
స్వర్గా
లెన్నున్నా నా సొంతం నువ్వేలే
దీపా
లెన్నున్నా నా కిరణం నువ్వేలే
ఆభరణా
లెన్నున్నా నా తిలకం మాత్రం నువ్వేలే
మధురమైన భాషలోన
మొదటి ప్రేమ నువ్వేలే
మరణమైన ఆశలోన
మరొక జన్మ నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన
నేస్తం నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన
స్నేహం నువ్వేలే 
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.