సోమవారం, అక్టోబర్ 02, 2017

ఓ బాపు నువ్వే రావాలి...

ఈ రోజు గాంధీ జయంతి సంధర్బంగా ఆ బాపూ మళ్ళీ రావాలి అని కోరుకునే ఈ పాట వింటూ బాపూజీని తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. పూర్తి పాట లిరిక్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శంకర్ దాదా జిందాబాద్ (2007)
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : దేవీశ్రీ ప్రసాద్, సాగర్ 

వందేమాతరం గాంధీ ఓంకారం
వందేమాతరం గాంధీ ఓంకారం

ఓ బాపు నువ్వే రావాలి
నీ సాయం మళ్ళీ కావాలి
వందేమాతరం గాంధీ ఓంకారం

జరిగే దుర్మార్గం ఆపాలి
నువ్వే ఓ మార్గం చూపాలి
వందేమాతరం గాంధీ ఓంకారం

కళ్ళజోడుతో చేతికర్రతో
కదిలే ఓ సత్యాగ్రహం..
కదిలే ఓ సత్యాగ్రహం

వెండికొండలా శిరసు పండినా
యువకుల మించిన సాహసం..
యువకుల మించిన సాహసం

బక్కపలచనీ బాపు గుండెలో
ఆ సేతు హిమాచలం
ద్రుక్కు నరాల్లో ఉప్పొంగే
స్వాతంత్ర్య రక్త గంగాజలం

సత్య మార్గమున మడమ తిప్పని
స్వరాజ్య దీక్షా మానసం
అతడంటే గడగడ వణికింది
ఆంగ్లేయుల సింహాసనం

వందేమాతరం గాంధీ ఓంకారం
వందేమాతరం గాంధీ ఓంకారం

చాకూ పిస్టలు కొడవలి గొడ్డలి
ఎందుకు హింసా సాయుధం..
ఎందుకు హింసా సాయుధం

ఆవేశం కోపం ద్వేషం కాదు
చిరునవ్వే మన ఆయుధం..
చిరునవ్వే మన ఆయుధం

సాటి మనిషిపై ప్రేమేగా
మన మాతృభూమికి గౌరవం
మానవతే మనకెన్నడు చెరగని
అందమైన గాంధీయిజం

వందేమాతరం గాంధీ ఓంకారం
వందేమాతరం గాంధీ ఓంకారం

భయం చెందని నెత్తురు చిందని
గాంధి మహోద్యమ జ్వాలలు
గాలి తరంగాలై వీచినవి
దేశంలో నలుమూలలు

వందేమాతరం గాంధీ ఓంకారం
వందేమాతరం గాంధీ ఓంకారం
వందేమాతరం గాంధీ ఓంకారం
వందేమాతరం గాంధీ ఓంకారం

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.