ద్వారక చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ద్వారక (2016)
సంగీతం : సాయికార్తీక్
సాహిత్యం : రహ్మాన్
గానం : సమీర భరద్వాజ్
ఎంత చిత్రం కదా
ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా
ఒక నవ్వుకే ఓడిపోయా
తప్పో ఒప్పో ఆలోచించే వీలే లేదాయె
తప్పనిసరిగా తెప్పను ముంచే ప్రేమే వరదాయే
ఈ ముప్పును తప్పుకుపోయే
వేరే దారే కనపడదాయే
ఎంత చిత్రం కదా
ఒక చూపుకే ఒరిగిపోయా
కంటి వైపు రానంది కునుకు
కత్తి మీద సామైంది బతుకు
గుండెల్లోన పుట్టింది ఒణుకు
గొంతు దాటి రానంది పలుకు
ఓరి దేవుడో ఇంత కోపమా నాపైన నీకు
చెప్పాలంటే అంత సులభమా శక్తినివ్వు నాకు
ఇక ఒక్క పూటైన నేనోర్చుకోగలనా
ఏదేమైనా ఏదో ఒకటి చెప్పేస్తా తనకు
ఎంత చిత్రం కదా
ఒక చూపుకే ఒరిగిపోయా
ముళ్ళే గుచ్చిపోయింది సొగసు
ఒళ్ళే మరచిపోయింది మనసు
ఉన్నట్టుండి లేచింది వయసు
ప్రేమో పిచ్చో నాకేమి తెలుసు
ఎంత ఆపిన ఆగనన్నది దూకే అడుగు
ఎంత దూరమో తెలియకున్నది తుళ్ళే పరుగు
తన తీరమేదైన ఏ దారిలోనైనా
చేరే వరకు అలుపే లేదు పట్టేస్తా తుదకు
ఎంత చిత్రం కదా
ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా
ఒక నవ్వుకే ఒదిగిపోయా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.