శుక్రవారం, అక్టోబర్ 20, 2017

ఉన్నట్టుండి గుండె...

నిన్ను కోరి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నిన్ను కోరి (2017)
సంగీతం : గోపీసుందర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : కార్తీక్, చిన్మయి

ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనదీ
సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినదీ

నేనా నేనా ఇలా నీతో ఉన్నా
ఔనా ఔనా అంటూ ఆహా అన్నా
హే నచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే
ఓయే ఓయే యే యే యే యే హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయే
ఓయే ఓయే యే యే యే యే తీసుకుపోయే

ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనదీ
సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినదీ

ఏ దారం ఇలా లాగిందో మరీ
నీ తోడై చెలీ పొంగిందే మదీ
అడిగి పొందినది కాదులే
తనుగా దొరికినది కానుక
ఇకపై సెకనుకొక వేడుక కోరే
కలా నీలా నా చెంత చేరుకుందిగా

హే నచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే
ఓయే ఓయే యే యే యే యే హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయే
ఓయే ఓయే యే యే యే యే తీసుకుపోయే

ఆనందం సగం ఆశ్చర్యం సగం
ఏమైనా నిజం బాగుంది నిజం
కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదలినది జీవితం
ఇకపై పదిలమే నా పథం నీతో
అటో ఇటో ఏవైపు దారి చూసినా

ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనదీ
సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినదీ
నేనా నేనా ఇలా నీతో ఉన్నా
ఔనా ఔనా అంటూ ఆహా అన్నా

హే నచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే
ఓయే ఓయే యే యే యే యే హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయే
ఓయే ఓయే యే యే యే యే తీసుకుపోయే

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.