సోమవారం, అక్టోబర్ 23, 2017

నటరాజు తలదాల్చు...

ఈ రోజు నాగుల చవితి సంధర్బంగా ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నాగుల చవితి (1956)
సంగీతం : గోవర్థనం, సుదర్శనం
సాహిత్యం : పరశురాం
గానం : ఎమ్.ఎల్.వసంత కుమారి

నటరాజు తలదాల్చు నాగ దేవా
నల్లనయ్య శయ్య నీవే నాగదేవా
నటరాజు తలదాల్చు నాగ దేవా
నల్లనయ్య శయ్య నీవే నాగదేవా
నిన్ను గొల్చు వారి ప్రాపు నీవేగావా
నిన్ను గొల్చు వారి ప్రాపు నీవేగావా
నాగస్వరం ఆలపింతూ ఆడరావా
ఆడరావా నాగదేవా ఆడరావా నాగదేవా
నాగస్వరం ఆలపింతూ ఆడరావా
ఆడరావా నాగదేవా

భువనైక నాధు శివుని భూషణమీవే..ఏ..

భువనైక నాధు శివుని భూషణమీవే..ఏ..
కరుణామయి గౌరి కర కంకణము నీవే
పాలకడలి చిల్కు వేల్పు రజ్జువు నీవే
పాలకడలి చిల్కు వేల్పు రజ్జువు నీవే
రవి చంద్రుల పట్టి మ్రింగు రాహుకేతువీవే

ఆడరావా నాగదేవా ఆడరావా నాగదేవా
నాగస్వరం ఆలపింతూ ఆడరావా
ఆడరావా నాగదేవా

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.