మంగళవారం, అక్టోబర్ 17, 2017

నా కథలో యువరాణి...

కథలో రాజకుమారి చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కథలో రాజకుమారి (2017)
సంగీతాం : ఇళయరాజా
సాహిత్యం : కృష్ణకాంత్
గానం : విభావరి

నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే
నా ఎదనే మలచుకున్నా రాణివాసంగానే
ఈ నేలే ఉయ్యాలై పాడుతుంది సరిగమలే
మేఘంలా నే తేలి తిరుగుతున్నా లోకాలే
మనసే రాసే చందమామ కథనే

నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే
నా ఎదనే మలచుకున్నా రాణివాసంగానే

చూసుకుంటాను నన్నే నేనే
పూసే పువ్వుల్లో విరబూసే నవ్వుల్లో
పాడుకుంటాను ఆటే ఆడే
ఊగే కొమ్మల్లో ఆ కోయిల గొంతుల్లో
కనిపించే సంతోషం నను చేరకుంటె రాదే
చిగురించే ఆనందం నేను పెంచుకున్న నాదే
ఆగమంటే రాను వెంటే చిన్నబోతోంది నీ అందం

నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే
నా ఎదనే మలచుకున్నా రాణివాసంగానే

దాచుకున్నాను కళ్ళలోనే ఏవో ఆ కథలు
ఎపుడొస్తాయో కలలు
గూడు కట్టేసి గుండెల్లోనే ఉండే స్నేహాలూ
ఎదురవుతాయా అసలు
కనిపించే ఆకాశం సిరివెన్నెలమ్మ నేస్తం
కురిసిందా చిరుజల్లే ఈ నేల తల్లి సొంతం
ఎక్కడుందో ఎక్కడుందో నన్ను చేరేటి ఆనందం 

నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే
నా ఎదనే మలచుకున్నా రాణివాసంగానే
ఈ నేలే ఉయ్యాలై పాడుతోంది సరిగమలే
మేఘంలా నే తేలి తిరుగుతున్నా లోకాలే
మనసే రాసే చందమామ కథలే

నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే
నా ఎదనే మలచుకున్నా రాణివాసంగానే
 

2 comments:

వేణూజీ..మీకూ మీ కుటుంబానికీ ధంత్రయోదశి శుభాకాంక్షలు..మెలోడియస్ సాంగ్..

థాంక్స్ శాంతి గారు.. మీకు కూడా ధనత్రయోదశి శుభాకాంక్షలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.