సోమవారం, అక్టోబర్ 30, 2017

శివ శివ శంకర...

కార్తీక సోమవారం సంధర్బంగా శివుని స్మరించుకుంటూ ఢమరుకం చిత్రంలోని ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ.


చిత్రం : ఢమరుకం (2012)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : శంకరమహాదేవన్

భం భం భో ... భం భం భో ...
భం భం భో ... భం భం భో ...
భం భం భో ... భం భం భో ...
భం భం భో ... భం భం భో ...

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతుము శంకరా!!

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతుము శంకరా!!

శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!

శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!

ఓం పరమేశ్వరా! పరా!!
ఓం నిఖిలేశ్వరా! హరా!!
ఓం జీవేశ్వరేశ్వరా! కనరారా!!
ఓం మంత్రేశ్వరా! స్వరా!!
ఓం యంత్రేశ్వరా! స్థిరా!!
ఓం మంత్రేశ్వరా పరా! రావేరా!!

శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతుము శంకరా!!

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతుము శంకరా!!

ఆకశాలింగమై ఆవహించరా
డమ డమమని డమరుఖ ధ్వని
సలిపి జడతని కదిలించరా!
శ్రీ వాయులింగమై సంచరించరా
అణువణువున తన తనువున నిలచి
చలనమే కలిగించరా!!
భస్మం చేసేయ్! అసురులను అగ్నిలింగమై లయకారా
వరదై ముంచేయ్ జలలింగమై ఘోరా!!
వరమై వశమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా
జగమే నడిపే పంచభూత లింగేశ్వరా కరుణించరా!!

శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతుము శంకరా!!

విశ్వేశ లింగమై కనికరించరా
విదిలిఖితమునిక బర బర చెరిపి
అమృతమే కురిపించరా
రామేశ లింగమై మహిమ చూపరా,
పలు శుభములు గని అభయములిడి
హితము సతతము అందించరా!!
గ్రహణం నిధనం బాపరా
కాళహస్తి లింగేశ్వరా!
ప్రాణం నీవై ఆలింగనమ్మీరా
ఎదలో కొలువై హర హర
ఆత్మ లింగమై నిలబడరా!
ద్యుతివై గతివై
సర్వ జీవలోకేశ్వరా రక్షించరా!!

శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!

శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!

శివ శివ శంకర హర హర శంకర
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
జయ జయ శంకర దిగిరారా!


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.