ఆదివారం, అక్టోబర్ 22, 2017

ఆనందమానందం...

వివేకం చిత్రంలోని ఒక చక్కని మెలోడీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వివేకం (2017)
సంగీతం : అనిరుధ్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : సత్యప్రకాష్, షాషాతిరుపతి

ఆనందమానందం ఆనందమే
ఒక్కోక్షణం నీతో అద్భుతమే
సరసాలు రాగాలు ఆనందమే
సరిపోని బింకాలు అద్భుతమే

కనుల నిండా కలల నిండా ఉంది నీవేలే
ఊపిరైనా ఊపిరల్లే ఉంది నీవల్లే
నా యీ జీవితం నీదే మరేదీ కోరికే లేదే
స్వయానా నువ్వుగా ప్రేమేఇలా నను కోరి చేరిందే

ఆనందమానందమానందమే
ఒక్కోక్షణం నీతో అద్భుతమే
సరసాలు రాగాలు ఆనందమే
సరిపోని బింకాలు అద్భుతమే

ఒక నువ్వు పక్కనుంటే చాలునంటానే
స్వర్గమైనా నరకమైనా మరచిపోతానే
అర ముద్దులొ చలిమల్లెపూవై నలిగిపొతాలే 
తెల్లారి పొద్దులో నీ గుండెగువ్వై ఒదిగిపోతాలే
నీవు నేను ఒక్కరె అనీవేళ చాటాలే
చంటి పాపై జననమై మన ప్రేమ వెలగాలే

ఆనందమానందం ఆనందమే
ఆనందమానందం ఆనందమే
ఆనందమానందం ఆనందమే


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.