మంగళవారం, అక్టోబర్ 10, 2017

వచ్చిండే మెల్ల మెల్లగ...

ఇటీవలి సూపర్ హిట్, కలక్షన్స్ తో తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేసిన ఫిదా చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఫిదా (2017)
సంగీతం : శక్తికాంత్ కార్తీక్
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం: మధుప్రియ, రాంకీ, కోరస్

వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 
క్రీము బిస్కెటు ఏసిండే 
గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే

హే.. పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే
డిన్నరన్నాడే డేటు అన్నాడే
ఏలు పట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీదా చేసిండే హెయ్ హెయ్
 
వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 
క్రీము బిస్కెటు ఏసిండే 
గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే
 పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే..ఒచ్చిండే..ఏఏ..ఆఅ.
మగవాళ్లు మస్తు చాలు.. హొయ్ హొయ్ 
మగవాళ్ళు మస్తు చాలు..ఆహ 
మగవాళ్ళు మస్తు చాలు.. మస్కలు కొడతా ఉంటారే
నువ్వు వెన్న పూస లెక్క కరిగితే అంతే సంగతే
ఓసారి సరే అంటూ ఓసారి సారీ అంటూ
మెయింటేను నువ్వు జేస్తే
లైఫ్ అంతా పడుంటాడే

వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 
క్రీము బిస్కెటు ఏసిండే 
గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే

అయ్ బాబోయ్ ఎంత పొడుగో 
అయ్ బాబోయ్ ఎంత పొడుగు
అయ్ బాబోయ్ ఎంత పొడుగు
ముద్దు లెట్టా ఇచ్చుడే
అయ్ బాబోయ్ ఎంత పొడుగు
ముద్దు లెట్టా ఇచ్చుడే
తన ముందో నిచ్చనేసి
ఎక్కితే కానీ అందడే
ఫరవాలే నడుము పట్టి
పైకెత్తి ముద్దే పెట్టే
టెక్నిక్సే నాకున్నాయిలే
పరేషానే నీకక్కర్లే

వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 
క్రీము బిస్కెటు ఏసిండే 
గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే
 
హేయ్ పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే వచ్చిండే..ఏఏ..
డిన్నరన్నాడే డేటు అన్నాడే అన్నాడే..ఏఏ..
ఏలు పట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీదా చేసిండే
అరే ఓ పిల్లా ఇంకా నువ్వు
నేలనిడిచి గాలి మోటర్‌లో.. తుర్ర్.ర్.ర్.ర్.ర్

వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 
క్రీము బిస్కెటు ఏసిండే 
గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్దా నోటికి పోకుండామస్తు డిస్ట్రబ్ జేసిండే


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.