సోమవారం, అక్టోబర్ 16, 2017

సుడిగాలల్లే దూసుకెళరా...

నక్షత్రం సినిమాలోని ఒక చక్కని స్ఫూర్తిదాయకమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నక్షత్రం (2017)
సంగీతం : హరిగౌర
సాహిత్యం : బాలాజి
గానం : హరిగౌర

సుడిగాలల్లే దూసుకెళరా 
గమ్యం ఎటు ఉన్నా 
తూఫానల్లే ఎగసిపడరా 
గమనం ఏదైనా 
కసి పెంచెయ్ రా 
కండలే కరిగించేయ్ రా 
కొలిమైపోరా నిప్పులే మరిగించెయ్ రా 
అడుగు అడుగున 

సుడిగాలల్లే దూసుకెళరా 
గమ్యం ఎటు ఉన్నా ఓఓఓఓ

ఓర్పుగ ఉంటే నేర్చుకుంటే
ఓటమె ఒక ఖడ్గం 
ఉప్పెనలున్నా నిప్పులున్నా 
వదలకు నీ లక్ష్యం 
నర నరమూ పిడికిలి చేసుకో 
ప్రతి క్షణమూ వరమని వాడుకో 
గురిపెడితే గుండెలు చీల్చరా 
తలతెగినా కల ఛేధించరా 
ఈ గాలి పంటిలో నీ పేరు మోసేలా 
ఈ నేల గుండెల్లో నీ గురుతులుండేలా 

సుడిగాలల్లే దూసుకెళరా 
గమ్యం ఎటు ఉన్నా 
తూఫానల్లే ఎగసిపడరా 
గమనం ఏదైనా ఓఓఓ

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.