శుక్రవారం, అక్టోబర్ 06, 2017

మడిలో ఒడిలో బడిలో గుడిలో...

దువ్వాడ జగన్నాథం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దువ్వాడ జగన్నాథం DJ (2017)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : సాహితి
గానం : కార్తికేయన్, చిత్ర

అస్మైక యోగ తస్మైక భోగ
రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ
సుకుమార సుందరం
ఆచంద్రతార, సంధ్యాసమీర
నీహారహార భూపాళం
ఆనంద తీర బృందా విహార
మందారసాగరం

మడిలో ఒడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివదనా
గదిలో మదిలో ఎదలో సొదలో
నీవెకదా గజగమనా
మడిలో ఒడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివదనా
గదిలో మదిలో ఎదలో సొదలో
నీవెకదా గజగమనా

ఆశగా నీకు పూజలే చేయ
ఆలకించింది నా గమకం
ప్రవరలో ప్రణవ మంత్రమే చూసి
పులకరించింది నీ సుముఖం
అగ్రహారాల తమలపాకల్లే
తాకుతోంది తమకం

మడిలో ఒడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివదనా
గదిలో మదిలో ఎదలో సొదలో
నీవెకదా గజగమనా

అస్మైక యోగ తస్మైక భోగ
రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ
సుకుమార సుందరం
ఆచంద్రతార సంధ్యాసమీర
నీహారహార భూపాళం
ఆనంద తీర బృందా విహార
మందారసాగరం

నవలలనా నీవలన కలిగె
ఎంతొ వింత చలి నాలోన
మిసమిసల నిశిలోనా
కసి ముద్దులిచ్చుకోనా
ప్రియ జఘన శుభ లగన
తల్లకిందలౌతు తొలి జగడాన
ఎడతెగని ముడిపడని
రస కౌగిలింతలోనా
కనులనే వేయి కలలుగా చేసి
కలిసిపోదాము కలకాలం
వానలా వచ్చి వరదలా మారె
వలపు నీలిమేఘం

మడిలో ఒడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివదనా
గదిలో మదిలో ఎదలో సొదలో
నీవెకదా గజగమనా

ప్రియ రమణ శత మదన
కన్నె కాలుజారి ఇక నీతోనా
ఇరు యదల సరిగమన
సిగ పూలు నలిగిపోనా
హిమ నయన సుమ శయన
చిన్నవేలు పట్టి శుభతరుణానా
పనసతొన కొరికితినా
పరదాలు తొలగనీనా
పడకగది నుంచి విడుదలే లేని
విడిది వేచింది మనకోసం
వయసు తొక్కిళ్ళ పడుచు ఎక్కిళ్ళు
తెచ్చె మాఘమాసం

మడిలో ఒడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివదనా
గదిలో మదిలో ఎదలో సొదలో
నీవెకదా గజగమనా

అస్మైక యోగ తస్మైక భోగ
రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ
సుకుమార సుందరం
ఆచంద్రతార, సంధ్యాసమీర,
నీహారహార భూపాళం
ఆనంద తీర బృందా విహార
మందారసాగరం

 

2 comments:

ఏముంది బయ్యా. ఈ పాటలో. ఇద్దరి శరీరాలు బుచికోయమ్మ బుచికి చేసుకుందాం. అంతేకదా.

నిజమే అయుండచ్చు అజ్ఞాత గారు.. కానీ ఈ రోజుల్లో ప్రణయాన్ని ఇంత సున్నితం గా తెలియచేయడం మెచ్చుకో దగిన విషయమే అనిపించిందండి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.