శుక్రవారం, అక్టోబర్ 13, 2017

రాధమ్మా రాధమ్మా రావే...

నేనే రాజు నేనేమంత్రి చిత్రంలో ఒకే ట్యూన్ లో ఉన్న ఈ చక్కని పాటలను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. జోగేంద్ర పాట లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నేనేరాజు నేనే మంత్రి (2017)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : సురేంద్ర కృష్ణ
గానం : మాస్టర్ రిషన్ రూబెన్స్, దివ్య

జోగేంద్ర జోగేంద్ర జోగేంద్రా..
జోగేంద్ర జోగేంద్రా.. జోగేంద్ర జోగేంద్రా..
జోగేంద్ర జోగేంద్రా చల్లంగుండాలి
రాజల్లె మ్మల్ని చల్లంగ చూడాలి
జోగన్నా జోగన్నా ఇంకా ఎదగాలి
నీ పేరు దేశం మొత్తం మోగిపోవాలి

జోగేంద్రా జోగేంద్రా చల్లంగుండాలి
నీ పేరు దేశం మొత్తం మోగిపోవాలి

గానం : విజయ్ ఏసుదాస్, రమ్య

జోగేంద్ర జోగేంద్రా
జోగేంద్ర జోగేంద్రా
ఓ..జోగేంద్ర జోగేంద్ర జై బోలో జోగేంద్ర
మా రాజు మా మంత్రి నువ్వే జోగేంద్ర
 
రాధమ్మ రాధమ్మ రావే రాధమ్మా
నా గేలుపు నా ఆనందం నీదే లేనమ్మా
రాధమ్మ రాధమ్మ మాటే వినవమ్మా
నిమిషం నువు కనపడకుంటే
మతి పోతుందమ్మా
వరాల వాన స్వరాల వీణ
నిజాన్ని చేబుతున్నా
అరే సందేహం ఉంటే నా కళ్లలోకే
సరాసరి చూడమంటున్న న.. న..
ధినకధిన్ న..న.. ధినకధిన్..నన.న
ధినకధిన్ న..న..ధినకధిన్..ననన.
రాధమ్మా రాధమ్మా.. 
ఓఓఓ రాధమ్మ రాధమ్మ రావే రాధమ్మా
నా గేలుపు నా ఆనందం నీదే లేనమ్మా

నీ కళ్లలోకే చూస్తుంటే చాలు
కాలాన్నే మరిచి ఉండిపోనా
కౌగిళ్ల గుడిలో చోటిస్తే చాలు
దీపాల వెలుగై నిండిపోనా
నేను గేలిచేదే నీకోసం
కోరుకోవే నా ప్రాణమైనా
వెండి వెన్నెల్లో ఆశతీరా
నీతోనే ఊయ్యాలూగాలీ ఓ.ఓ.ఓ..

జోగేంద్ర జోగేంద్ర ఓ.. జోగేంద్ర జోగేంద్ర
రాధమ్మ రాధమ్మ రావే రాధమ్మా
నా గేలుపు నా ఆనందం నీదే లేనమ్మా

హో..నీ చూపే శాంతం పలికే సంగీతం
నాకేగా సొంతం ఆసాంతం
నీ నవ్వే అందం నీ మాటే వేదం
పుణ్యాల ఫలితం నీ భందం
నువ్వు వెళ్ళేటి దారంతా
పూల వనమల్లే మారిపోదా
ఊరు ఊరంతా దిష్టి పేడితే
ఓ ముద్దుతోనే తీయనా.. ఓ.ఓ.ఓ..

జోగేంద్ర జోగేంద్ర ఓ జోగేంద్ర జోగేంద్ర
జోగేంద్ర జోగేంద్ర జై బోలో జోగేంద్ర
మా రాజు మా మంత్రి నువ్వే జోగేంద్రా

1 comments:

మంచి,మంచి పాటలు అందిస్తున్నారు కృతజ్ఞతలు. నేను కూడా సంగీత పిచ్చొడినే.
మరిన్ని పోస్టులు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.@ K.S.చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.