బుధవారం, అక్టోబర్ 11, 2017

మధురమే ఈ క్షణమే...

అర్జున్ రెడ్డి చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అర్జున్ రెడ్డి (2017)
సంగీతం : రాధన్
సాహిత్యం : శ్రేష్ట
గానం : సమీర భరద్వాజ్

మధురమే ఈ క్షణమే ఓ చెలీ
మధురమే ఈ క్షణమే
మధురమే వీక్షణమే ఓ చెలీ
మధురమే వీక్షణమే
మధురమే లాలసయే మధురం లాలనయే
మధురమే లాహిరినే మధురం లాలితమే
మధు పవనం వీచి మధు పవనం వీచి
పరువమే మైమరచిందిలే

కాలం పరుగులు ఆపి వీక్షించే అందాలే
మొహం తన్మయమొంది శ్వాసించే గంధాలే
ఊరించే రుచులను మరిగి ఉడికించె తాపాలే
ఉప్పొంగి ఊపిరి సెగలో కవ్వించే దాహాలే
మౌనంగా మధువుల జడిలోనా పులకించే ప్రాణాలే

మధురమే ఈ క్షణమే ఓ చెలీ
మధురమే ఈ క్షణమే

వీచే గాలులు దాగి చెప్పేనే గుస గుసలే
చూసే మూసి మూసి నవ్వులు చేసే బాసలనే
వశమై ఆనందపు లోగిట అరుదెంచి ఆకాశం
సగమై ఈ సాగరమందే అగుపించే ఆసాంతం
తీరం ముడివేసిన దారం తీర్చే ఎద భారాలే

మధురమే ఈ క్షణమే ఓ చెలీ
మధురమే ఈ క్షణమే
మధురమే వీక్షణమే ఓ చెలీ
మధురమే వీక్షణమే
మధురమే లాలసయే మధురం లాలనయే
మధురమే లాహిరిలే మధురం లాలితమే
మధు పవనం వీచి మధు పవనం వీచి
పరువమే మైమరచిందిలే

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.