శనివారం, అక్టోబర్ 21, 2017

నోట్లోన వేలు పెడితె...

మేడమీద అబ్బాయ్ చిత్రంలోని ఒక సరదా పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మేడమీద అబ్బాయ్ (2017)
సంగీతం : షాన్ రహ్మాన్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : వైకొం విజయలక్ష్మి

ఆహా.. నోట్లోన వేలు పెడితె అస్సల్ కొరకనట్టు
గూట్లోన బెల్లంముక్క మింగేసి ఎరగనట్టు
ఫేసుని చూస్తే రాముడు
పనులే చూస్తే కృష్ణుడూ
ఊరికొక్కడుంటే చాలు ఈడిలాంటోడు
ఒళ్ళంత ఎటకారం బాబోయ్ ఎవడండీ వీడు
కంట్లోన కారం కొట్టి కర్చీఫు అందిస్తాడు
చేసేదేంటో చెప్పడు చూసేదేంటో చెప్పడు
డాక్టర్ గారి చీటీలాగ అర్ధమవ్వడు

బిల్డప్పు చూస్తే హైరేంజి..
వీడు తాబేలు కన్నా యమలేజీ
వీడి వేషాలు అన్నీ వ్యాసాలు రాస్తే
అయ్యో సరిపోదొక్క పేజీ..
లైఫంటే వీడికి యమ ఈజీ
వీడికేం నేర్పగలదు కాలేజీ
అరె పాసైతే ఏంటీ ఫెయిలైతే ఏంటీ
ఏమీ పట్టించుకోడు క్రేజీ

నోట్లోన..
నోట్లోన వేలు పెడితె అస్సల్ కొరకనట్టు
గూట్లోన బెల్లంముక్క మింగేసి ఎరగనట్టు
ఫేసుని చూస్తే రాముడు
పనులే చూస్తే కృష్ణుడూ
ఊరికొక్కడుంటే చాలు ఈడిలాంటోడు
చీమంత కష్టం కూడా పడలేని బద్దకిష్టు
ఎట్టాగ ఎక్కగలడు ఎత్తైన ఎవరెస్టు
ఆలూలేదు చూలు లేదు
కొడుకు పేరు సోమలింగం
అన్నట్టుంది అయ్యబాబోయ్ వీడి వాలకం

ఆహా... ఆహాఅ.. 

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.