మంగళవారం, జూన్ 30, 2015

కురిసేను విరిజల్లులే...

ఇళయరాజా గారి స్వరసారథ్యంలో బాలు, వాణీజయరాం గార్లు అద్భుతంగా గానం చేసిన ఒక చక్కని పాట ఈరోజ్ తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఘర్షణ (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, వాణీ జయరాం

కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవె శ్రీకారమే కావె
 
కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే

ఆకుల పై రాలు ఆ..ఆఆ..
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి వొడిలోన పవళించనా
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి వొడిలోన పవళించనా

రాతిరి పగలు మురిపాలు పండించు
చెలికాని ఎద చేర్చి లాలించనా

నేను నీకు రాగ తాళం
నీవు నాకు వేద నాదం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
 
కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవె శ్రీకారమే కావె

కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే

కన్నుల కదలాడు ఆశలు శృతి పాడు
వన్నెల మురిపాల కధ యేమిటో
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో
ఊహలు పలికించు కలలేమిటో
పెదవుల తెరలోన మధురాల సిరివాన
మధురిమ లందించు సుధలేమిటో
 
పరవశమే సాగి పరువాలు చెలరేగి
మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహ బంధం 
ఆలపించే రాగ బంధం
ఆ..ఆ..ఆ..ఆ.
ఆ..ఆ..ఆ..ఆ

కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను 
శృంగారమునకీవె శ్రీకారమే కావె

కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే



సోమవారం, జూన్ 29, 2015

ఏదో అడగనా...

ఓకే బంగారం సినిమా కోసం రహ్మాన్ స్వరసారధ్యంలో సిరివెన్నెల గారు రాసిన ఒక చక్కని మెలోడీ ఈ రోజు విందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఓకే బంగారం (2015)
సంగీతం : ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శాశా తిరుపతి , సత్యప్రకాష్

విన్నావ నా హృదయం ఏదో అన్నదీ
కొన్నాళ్లుగా ఏదో నీలో ఉన్నదీ...
విన్నావ నా హృదయం ఏదో అన్నదీ
ఏదో అడగనా ఏదైనా అడగనా
 
ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
అణుకువగా అడగనా తెగ తెగువై అడగనా
అడగకనే అడగన అడిగినదే అడగన

ఏదో.. ఏదో..ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా

చిన్న చిన్న చిన్న చిన్న సంగతులే
చిన్న చిన్న చిన్న చిన్న సంగతులే
చిన్న చిన్న చిన్న చిన్న స్వరగతులే
చిన్న చిన్న సరదాలు
చిన్న దాని చిన్న చిన్న సంశయాలు
విన్నవించు ఆశలు పలికిన సరిగమలో..ఓ..ఓ..

 
ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా 
అణుకువగా అడగనా తెగ తెగువై అడగనా
అడగకనే అడగన అడిగినదే అడగనా...
ఏదో..ఏదో..ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా

తకధిమి తకధిమి జతిలోన
తకధిమి తకధిమి జతిలోన
తకధిమి తకధిమి సడిలోన
తకధిమి కదలిక
తకధిమి తికమక కవళిక
తదుపరి తకధిమి తెలుపని తరుణంలో

 
ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
అణుకువగా అడగనా తెగ తెగువై అడగనా
అడగకనే అడగన అడిగినదే అడగన
ఏదో..ఏదో..ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా


ఆదివారం, జూన్ 28, 2015

నడకలు చూస్తే...

సత్యం గారి స్వర సారధ్యంలో సినారె గారు రచించిన హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. కృష్ణ గారి ఈ పాట చూడకపోతే మీరు బోలెడంత ఎంటర్ టైన్మెంట్ మిస్ అవుతున్నట్లే :-) ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : టక్కరి దొంగ చక్కని చుక్క (1969)
సంగీతం : సత్యం
సాహిత్యం : సినారె
గానం : బాలు

ఓ చక్కని చుక్కా...హే చక్కని చుక్కా
 
నడకలు చూస్తే మనసౌతుంది
కులుకులు చూస్తే మతిపోతుంది
ఆహ.. ఓయబ్బో ఏమి సింగారం
ఓయబ్బో.. లేత బంగారం

 
చూడు.. ఇటు చూడు.. పగవాడు కాదు జతగాడు
నవ్వు.. అర నవ్వు.. రతనాల పెదవిపై రువ్వు
చూడు.. ఇటు చూడు.. పగవాడు కాదు జతగాడు
నవ్వు.. అర నవ్వు.. రతనాల పెదవిపై రువ్వు
ఒక కంట మంటలను మెరిపించు
ఒక కంట మంటలను మెరిపించు
కాని.. ఒక కంట మల్లెలను కురిపించు

ఓయబ్బో.. ఏమి చెలిసొగసు... 
ఓయబ్బో.. ఏమి తలబిరుసు
ఓయబ్బో.. ఏమి చెలిసొగసు... 
ఓయబ్బో.. ఏమి తలబిరుసు

నీనడకలు చూస్తే మనసౌతుంది
కులుకులు చూస్తే మతిపోతుంది
ఆహ ఓయబ్బో ఏమి సింగారం
ఓయబ్బో.. లేత బంగారం

 
ఊగి.. అటు సాగి.. ఒక నాగులాగ చెలరేగి
విసిరి.. అటు కసిరి.. తనువెల్ల చీకటులు ముసిరి
ఊగి.. అటుసాగి.. ఒక నాగులాగ చెలరేగి
విసిరి.. అటు కసిరి.. తనువెల్ల చీకటులు ముసిరి
ఈ పూట నన్ను ద్వేషించేవు
ఈ పూట నన్ను ద్వేషించేవు
కాని.. ఆపైన నన్నె ప్రేమించేవు

ఓయబ్బో.. ఏమి ఆవిరుపు... 
ఓయబ్బో.. ఏమి ఆ మెరుపు
ఓయబ్బో.. ఏమి ఆవిరుపు... 
ఓయబ్బో.. ఏమి ఆమెరుపు

నీనడకలు చూస్తే మనసౌతుంది
కులుకులు చూస్తే మతిపోతుంది
ఆహ ఓయబ్బో ఏమి సింగారం
ఓయబ్బో లేత బంగారం
ఓయబ్బో ఏమి సింగారం
ఓయబ్బో లేత బంగారం


శనివారం, జూన్ 27, 2015

ఏమయ్యిందీ వేళ...

జిబ్రాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన జిల్ సినిమాలోని ఒక చక్కని పాట ఈ రోజు విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జిల్  (2015)
సంగీతం : జిబ్రాన్
సాహిత్యం : కృష్ణకాంత్
గానం : క్లింటన్ సెరేజో , శరణ్య గోపినాథ్

ఏమయ్యిందీ వేళ నే పుట్టానా ఇంకోలా
చూస్తున్నా అన్నీ కొత్తగ నేడిలా
నీతోపాటు ఉండేలా ఈ లైఫ్ అంత
ఇలాగే వచ్చింది రేపే నేడులా ముందుగా

ఇపుడే తీరే ఈ కలనే కన్నా
చల్ చలే చెలీ చలో చలే
నిజమై పోయే ఊహల్లో ఉన్నా
చల్ చలే చెలీ చలో చలే

Don’t let go because now is the moment
Everyday would be just you and me
Don’t let go because now is the moment
Everyday would be just you and me

ఈ నిమిషం ఏంటో కదలక ఆగే... 
నా హా ఊహలు మాత్రం 
పరుగులు తీసే నేడే
ఏదేమైనా నీవెంటే నేనుంటా
నీ.... శ్వాస లాగ మారి
నీతో ఉంటే నాకేమి కాదంట
నా... ఊపిరింకా నీది

Don’t let go 'cause now is the moment
Everyday would be just you and me
Don’t let go 'cause you are in my soul
And my imagination is wild and free

ఏమయ్యిందీ వేళ పుట్టానా ఇంకోల
చూస్తున్నా అన్నీ కొత్తగ నేడిలా
నీతోపాటు ఉండేలా ఈ లైఫ్ అంత
ఇదేల వచ్చింది రేపే నేడులా ముందుగా

ఇపుడే తీరే ఈ కలనే కన్నా
చల్ చలే చెలో చలే చలే
నిజమై పోయే ఊహల్లో ఉన్నా
చల్ చలే చెలీ చలో చలే.....

Don’t let go 'cause now is the moment
Everyday would be just you and me
Don’t let go 'cause now is the moment
చూస్తున్నా అన్నీ కొత్తగ నేడిలా


శుక్రవారం, జూన్ 26, 2015

నీ నీడవుతా...

రాక్షసుడు చిత్రం కోసం యువన్ శంకర్ రాజా స్వరపరచిన ఒక చక్కని మెలొడీ ఈ రోజు విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ వినవచ్చు.


చిత్రం : రాక్షసుడు (2015)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : కార్తీక్, చిన్మయి

నీ నీడవుతా నీ తోడవుతా 
అడుగులో అడుగునై నీ నీడవుతా 
నువ్వే నా ప్రాణం అన్నా
నీ నింగిలో రెండో జాబిలినై
నే నిలిచే వరమీవా వరమీవా

ఆమెను మరపించకపొయినా
తలపించేలా నీ గుండెల్లో కాపురముంటా

కానీ చెలియా కానీ చెలియా
ఆమెకు ఇచ్చినా హృదయాన్ని 
నీకివ్వడానికి తడబాటు
కానీ చెలియా కానీ చెలియా
ఆమెతొ చేసిన పయనాలు 
నీతో కావాలీ అలవాటు

నా నింగిలో ఒక తారగ వచ్చావులే
మెల మెల్లగా వెన్నెలై నిండావులే నా గుండెలో
నా నేలపై ఒక పువ్వై విచ్చావులే
మెల మెల్లగా తోటవై పూచావులే నా గుండెలో
చిరునవ్వై నువ్వొస్తే చిగురించా మళ్ళీ నేను
సిరిమువ్వై నా ఎదలో రవళించావే..
వచ్చింది నాకోసమే ఇలా అమవాస లోన వెన్నెలా

కానీ చెలియా కానీ చెలియా
ఆమెకు ఇచ్చినా హృదయాన్ని నీకివ్వడానికి...

నేనిన్ను ప్రేమించు ముందే
నీ ప్రేమంత నా చిట్టితల్లికి నువ్విచ్చావ్ ఇంకేమి
నే కోరకుండానే వరమిచ్చు దేవతల దిగివస్తివే
ఒడిలో చేర్చీ జోలాలి పాడీ
నువ్ సేద దీర్చగా నా గాయమారెలే

నీవే చెలియా నీవే చెలియా
నీవే నా మౌనం నీవేనా గానం
నీవే నా ధ్యానం
నీవే చెలియా నీవే చెలియా
నీవే నా హృదయం నీవే నా ప్రయణం
నీవే నా లోకం



గురువారం, జూన్ 25, 2015

విన్నవించుకోనా...

బంగారు గాజులు చిత్రం లోని ఒకమంచి పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బంగారు గాజులు (1968)
సంగీతం : టి.చలపతిరావు
సాహిత్యం : దాశరధి
గానం : ఘంటసాల, పి.సుశీల 

విన్నవించుకోనా... ...చిన్న కోరిక...
ఇన్నాళ్ళూ ...నా మదిలో ఉన్న కోరికా... ఆ.
విన్నవించుకోనా ... ...చిన్నకోరికా...

నల్లనీ నీ కురులలో ...తెలతెల్లనీ సిరిమల్లెనై...
నల్లనీ నీ కురులలో తెలతెల్లనీ సిరిమల్లెనై
పరిమళాలు చిలుకుతూ ...నే పరవశించిపోనా... ఆ...
విన్నవించుకోనా ...చిన్న కోరికా...

వెచ్చనీ నీ కౌగిట . పవళించినా నవవీణనై...
వెచ్చనీ నీ కౌగిట .పవళించినా నవవీణనై ...
రాగమే అనురాగమై ...నీ మనసు నిండిపోనా... ఆ.
విన్నవించుకోనా ...చిన్న కోరికా...

 
తియ్యనీ నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై
తియ్యనీ నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై ...
అందరాని నీలి నింగి అంచులందుకోనా... ఆ...
విన్నవించుకోనా ... ...చిన్న కోరికా...

చల్లనీ నీ చూపులే తెలివెన్నెలై విరబూయగా...
చల్లనీ నీ చూపులే తెలివెన్నెలై విరబూయగా ...
కలువనై నీ చెలియనై నీ కన్నులందు వెలిగేనా... ఆ.

 
విన్నవించుకోనా... చిన్న కోరిక
ఇన్నాళ్ళూ నా మదిలో ఉన్నకోరికా...
విన్నవించుకోనా ...చిన్నకోరికా ...
 

బుధవారం, జూన్ 24, 2015

సూర్యుడు చూస్తున్నాడు...

అభిమన్యుడు చిత్రమ్ కోసం మహదేవన్ గారు స్వరపరచిన ఒక చక్కని ఆత్రేయ రచన ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అభిమన్యుడు (1984)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : ఆత్రేయ
గానం : బాలు, సుశీల

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు
నీవు నమ్మనివాడు నిజము చెబుతున్నాడు
వాడు నీవాడు..నేడు రేపు ఏనాడు

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు
నీవు నమ్మనివాడు నిజము చెబుతున్నాడు
వాడు నీవాడు..నేడు రేపు ఏనాడు

మ్మ్..హు..నిన్ను ఎలా నమ్మను? 
హహహ..ఎలా నమ్మించను?
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ప్రేమకు పునాది నమ్మకము
అది నదీసాగర సంగమము

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కడలికి ఎన్నో నదుల బంధము
మనిషికి ఒకటే హృదయము
అది వెలిగించని ప్రమిదలాంటిది
వలచినప్పుడే వెలిగేది
వెలిగిందా మరి?వలచావా మరి? 
వెలిగిందా మరి?వలచావా మరి? 
ఎదలొ ఏదో మెదిలింది
అది ప్రేమని నేడే తెలిసింది

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు
సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు 
నీవు నమ్మనివాడు నిజము చెబుతున్నాడు
వాడు నీవాడు..నేడు రేపు ఏనాడు

ఏయ్..వింటున్నావా?
మ్మ్..ఏం వినమంటావ్?
ఆ ఆ ఆ ఆ ఆ మనసుకు భాషే..లేదన్నారు
మరి ఎవరి మాటలను..వినమంటావు?
ఆ ఆఆఆ మనసు మూగగా..వినబడుతుంది
అది విన్నవాళ్ళకే..బాసవుతుంది

అది పలికించని వీణవంటిది
మీటినప్పుడే పాటవుతుంది
మీటేదెవరనీ? పాడేదేమని?
మీటేదెవ్వరని? పాడేదేమని?
మాటా మనసు ఒక్కటని 
అది మారని చెరగని సత్యమని

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు 
నీవు నమ్మనివాడు నిజము చెబుతున్నాడు 
వాడు నావాడు..నేడు రేపు..మ్మ్..ఏనాడు
 

మంగళవారం, జూన్ 23, 2015

ఈ మౌనం... ఈ బిడియం...

డాక్టర్ చక్రవర్తి లోని ఒక చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల, సుశీల

ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేనా ఇదేనా చెలియ కానుకా
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేలే ఇదేలే మగువ కానుకా... 
ఈ మౌనం...
 
ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
మమతలన్ని తమకు తామె ...
మమతలన్ని తమకు తామె అల్లుకొనెడి మాలిక... 
ఆ... ఆ...ఆ...ఆఆఆఆ
 
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేనా ఇదేనా చెలియ కానుకా
ఈ మౌనం...

మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
అహ... ఓహొ... ఆ....
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
కనులు కలిసి అనువదించు ప్రణయ భావగీతిక... 
ఆ...ఆ... ఆ...ఆఆఆఆఆ
 
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేలే ఇదేలే మగువ కానుక... 
ఈ మౌనం
 
ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
ఎంత ఎంత ఎడమైతే...
ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక... 
ఆ...ఆ... ఆ...ఆఆఆఆఆ

ఈ మౌనం... ఒహో ఈ బిడియం... ఊహూ 
ఇదేనా ఇదేనా చెలియ కానుకా 
ఈ మౌనం... ఒహో ఈ బిడియం... ఊహూ 
ఇదేలే ఇదేలే మగువ కానుకా... ఈ మౌనం


సోమవారం, జూన్ 22, 2015

యో లో యోలో...

అనేకుడు సినిమాలోని ఒక పర్ఫెక్ట్ పార్టీ సాంగ్ ఈ రోజు విందాం... సినిమాలో ఈ పాట సగమే ఉంది ఆ వీడియో ఎంబెడ్ చేశాను ఆడియో పూర్తి వర్షన్ యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు లేదా ఆన్ లైన్ లో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అనేకుడు (2015)
సంగీతం : హారీస్ జైరాజ్
సాహిత్యం : వనమాలి
గానం : శైల్ హడా, రమ్య, విక్కి, ఇడెన్

హు...ఓఓఓ...
యోలొ  యోలో యోలో.....
వద్దురా తమ్మి రొజీ నైన్ టు ఫైవ్ పోరాటం
వాడిపోయే వేరుకి నీరిస్తేనే ఆనందం
బ్లడీమేరీ లోన దూకెయ్ నా
లాంగ్ ఐలాండ్ ఐస్ టీ లో మునకెయ్ నా
పాలు తేనె పారే ఊళ్ళో మకామే వేద్దమా
ఆడి పాడి కూడి చిందేవేయి..
ఆశపడ్డదాన్ని సాదించెయ్
జారిపోతే ఆనందించే క్షణమే ఇక రాదే
 
యో లో యోలో....
న న న న.....నా.నా ...
యో లో యోలో....
యు ఓన్లి  లివ్ ఒన్స్ యే గా
యో లో యోలో....
న న న న.....నా.నా ...
యో లో యోలో....
యు ఓన్లి  లివ్ ఒన్స్ మామా

వెన్నెలా లైఫ్ ని కొంచెం స్పైసీ చేద్దామా
ఆశ అను కడలిలో మునిగి అమృతం తీద్దామా
పరువపు తీగ మీటేద్దాం
కొంటె పలుకులు పలికిద్దాం
లేదు లేదే ప్రేమ దోమా లెట్స్ ప్లే నేడుమాత్రం
అంటుకుంటు అగ్గి ముట్టిద్దాం
చుట్టిముట్టి మొగ్గ తుంచేద్దాం
నిధులమీదో కన్నే వేస్తే రాదే ఏ పాపం...
 
యో లో యోలో....
న న న న.....నా.నా ...
యో లో యోలో....
యు ఓన్లి  లివ్ ఒన్స్ యే గా
యో లో యోలో....
న న న న.....నా.నా ...
యో లో యోలో....
యు ఓన్లి  లివ్ ఒన్స్ మామా

హొల.......
కాస్త ఆలు పరొటాలొ
బార్బెక్యుని చేర్చి నువు కలిపెయ్
కొంచం జింజరు బీరు సైడు చేసి
చల్లని బీరు పొయి బేబే...
వాట్ దా ఫెరై ?

హే...వయ్యారి ముందుకు రాయే
నడుము షేక్ చేసి మందు పెట్టి పొయే
బుగ్గ మీద వేడీ ముద్దే ఇచ్చుకోయే
అరె మళ్ళీ ఓసారి నావైపే వస్తవా
 
మచ్చా ఐ కెన్ కం ఇఫ్ యు రోల్ అన్ దిస్ మడీఫ్లోర్
మవనే నెవర్ తాట్ ఐ విల్ బి సొ మచ్ ఇన్ కంట్రొల్
డర్టి ఫ్రెండ్స్ కాకీ డుడ్సు అల్ ద స్లాటి గాల్స్
వాచె ఏం అల్ ప్లే సెక్స్ బాక్స్ అన్ ద షొర్

 
రంగు పొంగు మొత్తం చెరిగిపొనీ
సిగ్గులొంగెదాక ఆల్లేసు కోనీ
ఈ నేరం యవ్వారం కలిసి పొవా గాలిలో 
ఓ..రంగు పొంగు మొత్తం చెరిగిపొనీ
సిగ్గులొంగెదాక ఆల్లేసు కోనీ
షాటప్ అండ్ కిక్ ఆస్ నౌ ఈ టైమే మనదిరా
 
గాలే వీచి కళ్ళే మూసి
నీపై వాలి నన్నే మరిచానే ఓఓ..
చలిలో కాగి వేళ్ళే తాకి
అధరం చేర్చి పోదాం పైపైనే

 
యో లో ...యో లో
యో లో ...యో లో
యో లో ...యో లో
న న న న.....నా.నా ...
యో లో ...యో లో
యు ఓన్లి  లివ్ ఒన్స్ మామా
యో లో ...యో లో
యు ఓన్లి  లివ్ ఒన్స్ ఇన్ ఎ లైఫ్ టైం
యో లో ...యో లో
హే హే హే.....
యో లో ...యో లో


ఆదివారం, జూన్ 21, 2015

ఓ నాన్న నీ మనసే...


ఈ రోజు ఫాదర్స్ డే కదా నాన్నలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలూ తెలుపుతూ తండ్రి ఔన్నత్యాన్ని తెలిపే ఓ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : ధర్మదాత (1970)
సంగీతం : తాతినేని చలపతిరావ్
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల, జయదేవ్

ఓ నాన్నా ఓ నాన్నా
ఓ నాన్న నీ మనసే వెన్న
అమృతం కన్నా అది ఎంతో మిన్న
ఓ నాన్నా ఓ నాన్నా

ముళ్ళ బాటలో నీవు నడిచావు
పూలతోటలో మమ్ము నడిపావు
ముళ్ళ బాటలో నీవు నడిచావు
పూలతోటలో మమ్ము నడిపావు
ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో
ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో
పరమాన్నం మాకు దాచి వుంచావు

ఓ నాన్న! నీ మనసే వెన్న
అమృతం కన్నా అది ఎంతో మిన్న
ఓ నాన్నా ఓ నాన్నా

పుట్టింది అమ్మ కడుపులోనైనా
పాలు పట్టింది నీ చేతిలోన
పుట్టింది అమ్మ కడుపులోనైనా
పాలు పట్టింది నీ చేతిలోన
ఊగింది ఉయ్యాలలోనైనా
ఊగింది ఉయ్యాలలోనైనా
నేను దాగింది నీ చల్లని ఒడిలోన..
చల్లని ఒడిలోన

ఓ నాన్న! నీ మనసే వెన్న
అమృతం కన్నా అది ఎంతో మిన్న
ఓ నాన్నా ఓ నాన్నా

ఉన్న నాడు ఏమి దాచుకున్నావు
లేనినాడు చేయి సాచనన్నావు
ఉన్న నాడు ఏమి దాచుకున్నావు
లేనినాడు చేయి సాచనన్నావు
నీ రాచగుణమే మా మూలధనము
నీ రాచగుణమే మా మూలధనము
నీవే మాపాలి దైవము
 
ఓ నాన్న! నీ మనసే వెన్న
అమృతం కన్నా అది ఎంతో మిన్న
ఓ నాన్నా ఓ నాన్నా


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

అలాగే నాన్న ప్రేమ గురించి ఈ ఇంగ్లీష్ పాట కూడా చాలా బాగుంటుంది మిస్ అవకుండా చూడండి.




~*~*~*~*~*~*~*~*~*~*~*~*~




ఈ రోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కూడా కనుక యోగ సాధకులందరుకు శుభాకాంక్షలు తెలుపుతూ అందరినీ యోగా ప్రాక్టీస్ చేసే దిశగా మోటివేట్ చేస్తున్న గవర్నమెంట్ ఇనిషియేటివ్ ను అభినందిస్తూ.. ప్రపంచ ప్రఖ్యాతినొందిన యోగా గురువులు బి.కె.ఎస్. అయ్యంగార్ గారి యోగ సాధన వీడియో ఎంబెడ్ చేస్తున్నాను. వారి ప్రతిభను చూసి అచ్చెరువొందని వారుండరేమో... అదే ప్రేరణతో మీరూ సాధన మొదలు పెట్టండి.

 

శనివారం, జూన్ 20, 2015

శీతాకాలం సూర్యుడ్లాగా...

సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం కోసం దేవీశ్రీ స్వరపరచిన శ్రీమణి రచన ఈ రోజు విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : S/O .సత్యమూర్తి (2015)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : Yazin Nizar, 
(RAP written and sung by 1080g)

ఓ..శీతాకాలం సూర్యుడ్లాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
వేసవి కాలం గాలుల్లాగా
కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా

వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే
సాయంకాలం సరదా లాగా మొత్తంగా రావే
కనులకు కలలు వయసుకు వలలు
విసిరిన మగువ మనసుకు దొరకవే

శీతాకాలం సూర్యుడ్లాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
వేసవి కాలం గాలుల్లాగా
కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా

Its love when you feel hot in the cold
Its love when you never ever get old
Its now when you just you and me
Yeah get closer and hold me

పగలేదో రాత్రేదో తెలిసీ  తెలియక నేను
మెలకువలో కలగంటూ సతమతమే అవుతున్నాను
ఎరుపేదో నలుపేదో కలరే తెలియక కన్ను
రంగులు తగ్గిన రెయిన్ బోలా కన్ఫ్యూజన్ లో  ఉన్నాను

A for అమ్మాయంటూ
B for బీటే  కొడుతూ
C for సినిమా హీరోలా
తిరిగానే .. తిరిగానే

D  for డార్లింగ్ అంటూ
E  for ఎవ్రీ నైటూ
F  for ఫ్లడ్ లైటేసీ
వెతికానే .. వెతికానే

కనులకు కలలు వయసుకు వలలు
విసిరిన మగువ మనసుకు దొరకవే

శీతాకాలం సూర్యుడ్లాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
ఓ..గా...ఓ..గా...ఓఓ....

When i see you i start hearing violins
Right there in the middle of silence
With the rest of the melody slowly fading in
Baby you are my symphony in all sense

గుండెల్లో మాటల్ని నీకెట్టా  చెప్పాలంటూ
ఏవేవో పాటల్లో రిఫరెన్స్ ఏదో  వెతికాను
వెన్నెల్లో కూర్చుంటే కొత్తేముందనుకున్నాను
నువ్వొచ్చీ  కలిసాకే డిఫరెన్స్ ఎదో  చూశాను

G for గర్ల్‌ఫ్రెండ్ అంటూ
H  for హమ్మింగ్  చేస్తూ
I for ఐ లవ్ యూ చెబుతూ
తిరిగానే .. తిరిగానే

J for జాబిలీ నువ్వు
K  for కౌగిలి నేను
L for లైఫ్ టైమ్ నీతోనే
ఉంటానే .. ఉంటానే

కనులకు కలలు వయసుకు వలలు
విసిరిన మగువ మనసుకు దొరకవే

శీతాకాలం సూర్యుడ్లాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా

వేసవి కాలం గాలుల్లాగా
కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా

The sun rises and then it sets
But something new happened the day we met
They both same to be happening at the same time
I knew i had to make you mine


శుక్రవారం, జూన్ 19, 2015

ఒకే ఒక గులాబికై...

నేనంటే నేనే చిత్రం కోసం కోదండపాణి గారు స్వరపరచిన ఒక సరదా అయిన పాటను ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నేనంటే నేనే (1968) 
సంగీతం : ఎస్.పి.కోదండపాణి 
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ఒకే ఒక గులాబికై వాలిన తుమ్మెదలెన్నెన్నో 
ఒకే ఒక కోరిక రేపిన వింతలు ఎన్నెన్నో...

ఒకే ఒక గులాబికై వాలిన తుమ్మెదలెన్నెన్నో 
ఒకే ఒక కోరిక రేపిన వింతలు ఎన్నెన్నో...
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..

సిరి కోరి నను చేరి తెరచాటునా 
చెలికాడు ఆడేను దోబూచులే..
సిరి కోరి నను చేరి తెరచాటునా 
చెలికాడు ఆడేను దోబూచులే.. 
కన్నులకు తెలియనిది 
కమ్మని మనసుకు తెలియనులే 
అల్లరిలో ఆటలలో చల్లని మనసే దాగెనులే..
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..

ఒకే ఒక గులాబికై వాలిన తుమ్మెదలెన్నెన్నో 
ఒకే ఒక కోరిక రేపిన వింతలు ఎన్నెన్నో...

కోనేట కలహంస ఎటు ఈదినా
తీరాన నా చెంత చేరాలిలే.. 
తళతళలు దక్కవులే దారిన పోయే దానయ్య 
వెలలేని మక్కువలు నోచిన వాని ధనమయ్యా

ఒకే ఒక గులాబికై వాలిన తుమ్మెదలెన్నెన్నో 
ఒకే ఒక కోరిక రేపిన వింతలు ఎన్నెన్నో...
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..


గురువారం, జూన్ 18, 2015

చల్లగాలి తాకుతున్న...

యెవడే సుబ్రహ్మణ్యం సినిమా కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఒక చక్కని మెలోడీ ఈ రోజు విందాం. ఈ  పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఎవడే సుబ్రహ్మణ్యం
సంగీతం : రాధన్ (ఒరిజినల్ సాంగ్: ఇళయరాజా) 
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : సెంథిల్, రిషిత

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా
ఎందుకంట ఇంత దగా, నిన్న మొన్న లేదుకదా?
ఉండి ఉండి నెమ్మదిగా నన్ను ఎటో లాగుతుందా
పదమే తప్పించుకోలేననీ తోచేట్టుచేస్తున్నదా

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా

ఎవరో అన్నారనీ మారవే నాలో ఆశలూ
ఎవరేం అన్నారనీ పొంగెనే ఏవో ఊహలూ
ఎవరో అన్నారనీ మారవే నాలో ఆశలూ
ఎవరేం అన్నారనీ పొంగెనే ఏవో ఊహలూ
తీరం తెలిశాకా ఇంకా దారిని మార్చానా
దారులు సరియైనా వేరే తీరం చేరానా
నడకలు నావేనా, నడిచేదీ నేనేనా

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా

ఎంతగా వద్దంటున్నా ఆగదే ఆత్రం ఏమిటో
ఇంతగా పొంగేటంత అవసరం ఏమో ఎందుకో
ఐనా ఏమైనా ఎద నా చెయి జారిందే..
ఎపుడో ఏనాడో ప్రేమే నేరం కాదందీ
చెలిమే ఇంకోలా చిగురిస్తూ ఉందటే

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా

బుధవారం, జూన్ 17, 2015

బొమ్మా బొరుసా పందెం...

బొమ్మా బొరుసా చిత్రం లోని ఒక సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బొమ్మా బొరుసా (1971)
సంగీతం : ఆర్. సుదర్శనం
సాహిత్యం : కొసరాజు
గానం : బాలు, పిఠాపురం

బొమ్మా బొరుసా పందెం వెయ్యి  నీదో నాదో పై చెయ్యీ
కమాన్.. క్లేప్.. వన్.. టూ

బొమ్మా బొరుసా పందెం వెయ్యి.. నీదో నాదో పైచెయ్యీ
బొమ్మా బొరుసా పందెం వెయ్యి.. నీదో నాదో పైచెయ్యీ
బొమ్మయితేనే నీ గెలుపు... బొరుసయితేనూ నా గెలుపు

బొమ్మా బొరుసా పందెం వెయ్యి.. నీదో నాదో పైచెయ్యీ
బొమ్మయితేనే నీ గెలుపు.. బొరుసయితేనూ నా గెలుపు

 

డబ్బుంటే గద పైకెగ రేయడం అది లేందెందుకు ఊరక డంబం
డబ్బుంటే గద పైకెగ రేయడం అది లేందెందుకు ఊరక డంబం
సాగిన్నాడూ సర్దాగుండూ ఎదురు తిరిగితే ఏముండూ
నడమంత్రపు సిరీ వచ్చిన్నాడూ నెత్తికి కళ్ళూ వచ్చును చూడూ

బొమ్మా బొరుసా పందెం వెయ్యి.. నీదో నాదో పైచెయ్యీ
బొమ్మయితేనే నీ గెలుపు...  బొరుసయితేనూ నా గెలుపు

 

చంకీ లేందే జడవదు గుర్రం.. గోతిలో పడితే లంగడా గుర్రం
చంకీ లేందే జడవదు గుర్రం.. గోతిలో పడితే లంగడా గుర్రం
హద్దు మీరితే హడవాగుర్రం.. అదుపులో వుంటే జట్కాగుర్రం
సాధుకు కోపం.. రేగినప్పుడూ..  వధ బట్టందే వదలి పెట్టడూ

బొమ్మా బొరుసా పందెం వెయ్యి..  నీదో నాదో పైచెయ్యీ
బొమ్మయితేనే నీ గెలుపు..  బొరుసయితేనూ నా గెలుపు

 

పిండుంటే గద రొట్టె చెయ్యడం కొప్పుంటే గద పూలు పెట్టడం
పిండుంటేగద రొట్టె చెయ్యడం కొప్పుంటే గద పూలు పెట్టడం
చమురంటే గద దీపమెలగడం డబ్బుంటే గద డాబుచెల్లడం
ఆడపెత్తనం.. ఎన్నాళ్లు సాగూ..  గుట్టుతెలిస్తే చిటికెలో ఆగు

బొమ్మా బొరుసా పందెం వెయ్యి.. నీదో నాదో పైచెయ్యీ
బొమ్మా బొరుసా పందెం వెయ్యి.. నీదో నాదో పైచెయ్యీ

బొమ్మయితేనే నీ గెలుపు.. బొరుసయితేనూ నా గెలుపు
బొమ్మయితేనే నీ గెలుపు.. బొరుసయితేనూ నా గెలుపు


మంగళవారం, జూన్ 16, 2015

కానుకే బొండుమల్లి...

ఉత్తమ విలన్ చిత్రం కోసం జిబ్రన్ స్వరపరచిన ఒక చక్కని మెలొడి ఈరోజు విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా యూట్యూబ్ జ్యూక్ బాక్స్ లో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : ఉత్తమ విలన్ (2015)
సంగీతం : జిబ్రన్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : పద్మలత

కానుకే బొండుమల్లి కైవసం కౌగిలీ
ఆకలీ దాహమే ఆరాధనం ఆరాధనం

ఆఆఅ..కానుకే బొండుమల్లీ కైవసం కౌగిలీ
ఆకలీ దాహమే ఆరాధనం ఆరాధనం

కానుకే బొండుమల్లి కైవసం కౌగిలీ

విల విలా విరహమే అలలయ్యే కడలినై
ప్రణయమే పయనమై పరుగిడే పడవ నై
కలను వెతికి కరిగి మరిగా
మెత్తని మైనపు దేహమై
తలపు వీణను మీటెను తాపం
మాయా మన్మధుని పూల శరమై

కానుకే... ఆఆ.. కైవసం.... ఆఆ..
ఆకలీ దాహమే ఆరాధనం ఆరాధనం

మాటలే వలయునా మనసులే పెనవేయగా
మౌనమే చాలదా మోహమే కలబోయగా
సరస కాలపు సంగీత తాళం
చెంపన చిటెకలు వేయించవా
శృంగార శిఖరపు అంచులు చేరగ
నాతో ఉప్పొంగెడి ఊపిరి కావా

కానుకే బొండుమల్లి కైవసం కౌగిలీ
ఆకలీ దాహమే ఆరాధనం ఆరాధనం

సోమవారం, జూన్ 15, 2015

అవునా నీవేనా...

రుద్రమదేవి చిత్రం కోసం ఇళయరాజా గారి స్వరకల్పనలో సిరివెన్నెల గారు రాసిన పాట ఇది. ఈ పాట వీడియో ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు ఆడియో వినాలంటే క్రింది ఎంబెడెడ్ యూట్యూబ్ లింక్ లో వినవచ్చు.


చిత్రం : రుద్రమదేవి  (2015)
సంగీతం : ఇళయరాజా
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం :  హరిహరన్, సాధనా సర్గమ్

అవునా నీవేనా నే వెతుకుతున్న నిధివేనా
ఎదరున్నా ఎదలోనా నిదురించు కాంతివనుకున్నా
అవునా నిన్నేనా వెన్నంటు చెలిమివనుకున్నా
ఐనా ఇక పైనా వెంటాడు కలతవనుకోనా
 
నిను కలవనా... నను మరువనా
తహ తహల తపనలు తరిమెను తమవలనా
 
అవునా నీవేనా నే వెతుకుతున్న నిధివేనా
ఐనా ఇక పైనా వెంటాడు కలతవనుకోనా
 
గూడు వీడిపొయే గువ్వయింది మనసు
మేర మీరిపొయే ఏరయింది వయసు 
నిన్ను చూసి చూడగానే నేను ఏమయ్యానో
నువ్వు తాకీ తాకగానే కొత్తజన్మయ్యానో
లేని పోని మాయ ఏమిది 
తీయనైన గాయమైనది
హాయి కాని హాయే ఇది ఎదేవైనా
 
అవునా నీవేనా నే వెతుకుతున్న నిధివేనా
ఐనా ఇక పైనా వెంటాడు కలతవనుకోనా
 
ఇన్ని నాళ్లు లేదే నేడిదేమి బిడియం  
కాలు కదపనీదే వేడుకైన సమయం
తూలరాదే మెలుకాదే పిచ్చి బేలతనమా 
ఆప తరమా వెంట తరిమే పిల్లగాలి మహిమ
సింగమంటి పౌరుషం ఇలా
బెంగ పడితే పరువు కాదేల
జింక పిల్ల కళ్ళే ఇలా వేటాడేనా
 
అవునా నిన్నేనా వెన్నంటు చెలిమివనుకున్నా
ఐనా ఇక పైనా వెంటాడు కలతవనుకోనా
 
నిను కలవనా... నను మరువనా
తహ తహల తపనలు తరిమెను తమవలనా

అవునా నీవేనా నే వెతుకుతున్న నిధివేనా
ఐనా ఇక పైనా వెంటాడు కలతవనుకోనా

 

ఆదివారం, జూన్ 14, 2015

ఓ బుచ్చిబాబు...

నాటకాలరాయుడు చిత్రంలోని ఒక సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. పాట ట్యూన్ సరదాగా సాగినా ఇందులో బోలెడన్ని జీవిత సత్యాలను గుప్పించేశారు ఆత్రేయగారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : నాటకాలరాయుడు (1969) 
సంగీతం : జి.కె.వెంకటేష్ 
సాహిత్యం : ఆత్రేయ 
గానం : బాలు

ఇదే జీవితమురా ఇదే దాని కతరా 
తంటాల బ్రహ్మయ్యా తకరార్లు ఇవిరా 

ఓ... బుచ్చిబాబు... 
ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చి బాబు 
తలరాత ఒకే తికమక మకతిక 
ముఖ ముఖానికి రకరకాలుగా 
తికమక మకతిక తికమక 

ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చి బాబు
తలరాత ఒకే తికమక మకతిక 
ముఖ ముఖానికి రకరకాలుగా 
తికమక మకతిక తికమక 
ఓ బుచ్చిబాబు..

బడా యాక్టరు అవుతానంటూ 
బడాయి కొట్టి వచ్చావు 
భలే భలేరా.. భలే భలేరా 
కొళాయి దగ్గర అంట్లే తోమేవు
చివరకు అంట్లే తోమేవు 
ఓ అబ్బాయి ఏ పనికైనా ఫిట్టూ 
నువ్వు ఫిట్టూ ఇది కరకట్టు 
ఇవి తోమి పెట్టు 
తోము తోము తోము తకథోం..

ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చి బాబు
తలరాత ఒకే తికమక మకతిక 
ముఖ ముఖానికి రకరకాలుగా 
తికమక మకతిక తికమక 
ఓ బుచ్చిబాబు

ప్రపంచమే ఒక నాటకరంగం 
కదిలిస్తే చదరంగం 
నవాబు వేషం వేసేవాడు 
జవాను పని చేస్తాడు 
చివరకు గరీబుగా ఛస్తాడు 
ఓ అబ్బాయి కళాజీవితం 
లక్కు ఒక ట్రిక్కు 
ఒకరికి లక్కు ఒకరికి ట్రిక్కు 
లక్కు ట్రిక్కు లక్కూ 

ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చి బాబు
తలరాత ఒకే తికమక మకతిక 
ముఖ ముఖానికి రకరకాలుగా 
తికమక మకతిక తికమక 
ఓ బుచ్చిబాబు

ఒకడి ఆకలికి అంబలి నీళ్ళు 
ఒకడికి పాలు పళ్లు 
భలే భలేరా.. భలే భలేరా 
దగాల దేవుడ బాగా పంచావు 
కోతికి బాబనిపించావు
ఓ బ్రహ్మయ్యో నీ లీలలే 
గడబిడ యడ పెడ 
నీ గడాబిడా మాకెడాపెడా 
గడబిడ ఎడపెడ గడబిడ 

ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చి బాబు
తలరాత ఒకే తికమక మకతిక 
ముఖ ముఖానికి రకరకాలుగా 
తికమక మకతిక తికమక 
ఓ బుచ్చిబాబు....


శనివారం, జూన్ 13, 2015

చిలిపి యాత్రలో...

సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య369 చిత్రం లోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఆదిత్య 369 (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో
పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్కపెట్టుకో అరెరెరె..

చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
 
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో

ఎదురుగ ఉంది ఏదో వింత 
పదపద చూద్దాం ఎంతో కొంత
కలలకు కూడా కొత్తే అవునా 
కనపడలేదే నిన్నా మొన్నా
కనులవిందుగా ఉందీ లోకం 
కనుక ఇక్కడే కాసేపింకా ఉందాం
కలవరింతలా ఉందీ రాగం 
కనక మెల్లగా మళ్లీ మళ్లీ విందాం 
ఎవర్నైనా హలో అందాం 
ఎటేముందో కనుక్కుందాం
టుమారోల సమాచారమంతా 
సులువుగ తెలిసిన తరుణము కద ఇది 

చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో

కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో
పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్కపెట్టుకో అరెరెరె..

చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
 
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
 
వినపడలేదా కూ కూ వెల్కం 
అతిథులమంటూ ఆన్సర్ చేద్దాం 
తళతళలాడే తారా తీరం 
తలుపులు తీసే దారే చూద్దాం
మునుపు ఎప్పుడూ లేదీ మైకం 
మయుడి మిస్టరీ ఏమో ఈ మాలోకం 
మెదడు విక్టరీ చేసే చిత్రం 
తెలివి డిక్ష్నరీ చెప్పే మాయా మంత్రం
నిదానించి ప్రవేశిద్దాం రహస్యాలు పరీక్షిద్దాం 
కనుక్కున్న చమత్కారాలన్ని 
చిలవలుపలవలు కలిపి తెలుపుదాం 

చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో
పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్కపెట్టుకో అరెరెరె..

చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
 
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో



నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.