ఆదివారం, జూన్ 28, 2015

నడకలు చూస్తే...

సత్యం గారి స్వర సారధ్యంలో సినారె గారు రచించిన హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. కృష్ణ గారి ఈ పాట చూడకపోతే మీరు బోలెడంత ఎంటర్ టైన్మెంట్ మిస్ అవుతున్నట్లే :-) ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : టక్కరి దొంగ చక్కని చుక్క (1969)
సంగీతం : సత్యం
సాహిత్యం : సినారె
గానం : బాలు

ఓ చక్కని చుక్కా...హే చక్కని చుక్కా
 
నడకలు చూస్తే మనసౌతుంది
కులుకులు చూస్తే మతిపోతుంది
ఆహ.. ఓయబ్బో ఏమి సింగారం
ఓయబ్బో.. లేత బంగారం

 
చూడు.. ఇటు చూడు.. పగవాడు కాదు జతగాడు
నవ్వు.. అర నవ్వు.. రతనాల పెదవిపై రువ్వు
చూడు.. ఇటు చూడు.. పగవాడు కాదు జతగాడు
నవ్వు.. అర నవ్వు.. రతనాల పెదవిపై రువ్వు
ఒక కంట మంటలను మెరిపించు
ఒక కంట మంటలను మెరిపించు
కాని.. ఒక కంట మల్లెలను కురిపించు

ఓయబ్బో.. ఏమి చెలిసొగసు... 
ఓయబ్బో.. ఏమి తలబిరుసు
ఓయబ్బో.. ఏమి చెలిసొగసు... 
ఓయబ్బో.. ఏమి తలబిరుసు

నీనడకలు చూస్తే మనసౌతుంది
కులుకులు చూస్తే మతిపోతుంది
ఆహ ఓయబ్బో ఏమి సింగారం
ఓయబ్బో.. లేత బంగారం

 
ఊగి.. అటు సాగి.. ఒక నాగులాగ చెలరేగి
విసిరి.. అటు కసిరి.. తనువెల్ల చీకటులు ముసిరి
ఊగి.. అటుసాగి.. ఒక నాగులాగ చెలరేగి
విసిరి.. అటు కసిరి.. తనువెల్ల చీకటులు ముసిరి
ఈ పూట నన్ను ద్వేషించేవు
ఈ పూట నన్ను ద్వేషించేవు
కాని.. ఆపైన నన్నె ప్రేమించేవు

ఓయబ్బో.. ఏమి ఆవిరుపు... 
ఓయబ్బో.. ఏమి ఆ మెరుపు
ఓయబ్బో.. ఏమి ఆవిరుపు... 
ఓయబ్బో.. ఏమి ఆమెరుపు

నీనడకలు చూస్తే మనసౌతుంది
కులుకులు చూస్తే మతిపోతుంది
ఆహ ఓయబ్బో ఏమి సింగారం
ఓయబ్బో లేత బంగారం
ఓయబ్బో ఏమి సింగారం
ఓయబ్బో లేత బంగారం


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.