మంగళవారం, జూన్ 09, 2015

ఉరుములు నీ మువ్వలై...

చంద్రలేఖ సినిమాలోని ఒక మంచి మెలోడీ సాంగ్ ను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : చంద్రలేఖ (1998)
సంగీతం : సందీప్ చౌతా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : రాజేష్ , సుజాత

ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని
కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ
అది చూడగా మనసాగకా ఆడాలి నీతో నింగినేల

తకథిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని
మెలికల మందాకిని కులుకుల బృందావని
కనులకు విందీయవే ఆ అందాన్ని

చంద్రుళ్లో కుందేలే మా ఇంట ఉందంటూ
మురిసింది ఈ ముంగిలి
 
చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే
ప్రతిపూటా దీపావళి
మా కళ్లల్లో వెలిగించవే సిరివెన్నెలా... 
మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మోగే వేళ
ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళా
 
ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా కళ్యాణి
తకథిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసానీ

 
నడియాడే నీ పాదం నటవేదమేనంటూ
ఈ పుడమే పులకించగా
నీ పెదవి తనకోసం అనువైన కొలువంటూ
సంగీతం నినుచేరగా 
మా గుండెనే శ్రుతి చేయవా నీ వీణలా
ఈ గాలిలో నీ కేళితో రాగాలు ఎన్నో రేగే వేళ 
నీ మేనిలో హరివిల్లులే వర్ణాలవాగై సాగే వేళ

ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
తకథిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగ చిందాడవే మ్మ్ మ్మ్...

2 comments:

ఎప్పుడూ నేనీ పాటని పాడుకుంటునే ఉంటాను.
ఆ పాటని విని, చూసి, పూర్తిగా నేర్చుకునే అవకాశం మరోసారి కలిగించినందుకు...
ధన్యవాదాలు.

థాంక్స్ హిమబిందు గారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.