మంగళవారం, జూన్ 30, 2015

కురిసేను విరిజల్లులే...

ఇళయరాజా గారి స్వరసారథ్యంలో బాలు, వాణీజయరాం గార్లు అద్భుతంగా గానం చేసిన ఒక చక్కని పాట ఈరోజ్ తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఘర్షణ (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, వాణీ జయరాం

కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవె శ్రీకారమే కావె
 
కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే

ఆకుల పై రాలు ఆ..ఆఆ..
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి వొడిలోన పవళించనా
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి వొడిలోన పవళించనా

రాతిరి పగలు మురిపాలు పండించు
చెలికాని ఎద చేర్చి లాలించనా

నేను నీకు రాగ తాళం
నీవు నాకు వేద నాదం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
 
కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవె శ్రీకారమే కావె

కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే

కన్నుల కదలాడు ఆశలు శృతి పాడు
వన్నెల మురిపాల కధ యేమిటో
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో
ఊహలు పలికించు కలలేమిటో
పెదవుల తెరలోన మధురాల సిరివాన
మధురిమ లందించు సుధలేమిటో
 
పరవశమే సాగి పరువాలు చెలరేగి
మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహ బంధం 
ఆలపించే రాగ బంధం
ఆ..ఆ..ఆ..ఆ.
ఆ..ఆ..ఆ..ఆ

కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను 
శృంగారమునకీవె శ్రీకారమే కావె

కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.