ఆదివారం, జూన్ 07, 2015

మేఘాలే తాకింది...

ప్రేమించుకుందాం చిత్రంలో ప్రేపాడుకునే హుషారైపాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమించుకుందాం.. రా (1997)
సంగీతం : మహేష్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

మేఘాలే తాకింది హాయి హైలెస్స
నవరాగంలో నవ్వింది నా మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
చేలరేగాలి రమ్మంది హల్లో అంటూ..
ఒళ్ళోవాలే అందాల అప్సరస

మేఘాలే తాకింది హాయి హైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ..
అల్లేసింది నీ మీద నా ఆశ

ఆ..ఆ..ఆ..

తొలిసారి నిను చూసి మనసాగక
పిలిచానే చిలకమ్మ మెల మెల్లగ
తెలుగంత తీయంగ... నువ్వు పలికావే స్నేహంగా
చెలిమన్న వలవేసి నను లాగగా
చేరాను నీ నీడ చల చల్లగా
గిలిగింత కలిగేలా... తొలి వలపంటే తేలిసేలా
హా.. కునుకన్న మాటే నను చేరక
తిరిగాను తేలుసా ఏం తోచక
 
మేఘాలే తాకింది హాయి హైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
 

ఆ..ఆ..ఆ..
తొలి పొద్దు వెలుగంత చిరువేడిగా
నిలువెల్ల పులకింత చిగురించగా
దిగులేదో హాయేదో.. గుర్తు చెరిపింది ఈ వింత

ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా
నిజం ఏదో కల ఏదో మరిపించగా
పగలేదో రేయేదో... రెండు కలిశాయి నీ చెంత 
ప్రేమంటే ఇంతే ఏమో మరి
దానంతు ఏదో చూస్తే సరి

మేఘాలే తాకింది హాయి హైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా 
ఈ గాలి రేపింది నాలో నిష
అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ...
అల్లేసింది నీ మీద నా ఆశ..
మేఘాలే తాకింది హాయి హైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా

2 comments:

ఈ సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఏమిటో నాకు తెలీదు కానీ, సినిమా భలే కనెక్టయ్యింది నాకు. రాయల సీమలో, ఆ యాసతో కూడిన డయిలాగుల వల్ల కావచ్చు, వెంకటేష్ లాంటి పెద్ద హీరో నటించిన ప్రేమ కథా చిత్రం అవడం వల్లకావచ్చు.. ఈ సినిమా స్పెషల్గా అనిపిస్తుంది నాకు. పాటలన్నీ బావుంటాయి. అంజలా జవేరి అయితే.. పక్కింటి అమ్మాయిలా సింపులుగా చాలా బావుంటుంది. ఈ సినిమా తరువాత లిటిల్ హార్ట్స్ బిస్కట్స్ ప్యాకెట్లు తెగ కొనేవాన్ని (నేను తినడానికే లెండి :-) ).. మంచి పాట గుర్తు చేశారు.. :-)

థాంక్స్ ఫర్ ద కామెంట్ శ్రీకాంత్ గారు.. అవునండీ అప్పట్లో ఈ సినిమా యూత్ కి కనెక్ట్ కావడానికి చాలా కారణాలే ఉన్నాయి :-) లిటిల్ హార్ట్స్ ని చాలా బాగా వాడుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.