బంగారు గాజులు చిత్రం లోని ఒకమంచి పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : బంగారు గాజులు (1968)
సంగీతం : టి.చలపతిరావు
సాహిత్యం : దాశరధి
గానం : ఘంటసాల, పి.సుశీల
విన్నవించుకోనా... ...చిన్న కోరిక...
ఇన్నాళ్ళూ ...నా మదిలో ఉన్న కోరికా... ఆ.
విన్నవించుకోనా ... ...చిన్నకోరికా...
నల్లనీ నీ కురులలో ...తెలతెల్లనీ సిరిమల్లెనై...
నల్లనీ నీ కురులలో తెలతెల్లనీ సిరిమల్లెనై
పరిమళాలు చిలుకుతూ ...నే పరవశించిపోనా... ఆ...
విన్నవించుకోనా ...చిన్న కోరికా...
వెచ్చనీ నీ కౌగిట . పవళించినా నవవీణనై...
వెచ్చనీ నీ కౌగిట .పవళించినా నవవీణనై ...
రాగమే అనురాగమై ...నీ మనసు నిండిపోనా... ఆ.

తియ్యనీ నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై
తియ్యనీ నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై ...
అందరాని నీలి నింగి అంచులందుకోనా... ఆ...
విన్నవించుకోనా ... ...చిన్న కోరికా...
చల్లనీ నీ చూపులే తెలివెన్నెలై విరబూయగా...
చల్లనీ నీ చూపులే తెలివెన్నెలై విరబూయగా ...
కలువనై నీ చెలియనై నీ కన్నులందు వెలిగేనా... ఆ.

విన్నవించుకోనా... చిన్న కోరిక
ఇన్నాళ్ళూ నా మదిలో ఉన్నకోరికా...
విన్నవించుకోనా ...చిన్నకోరికా ...
ఇన్నాళ్ళూ నా మదిలో ఉన్నకోరికా...
విన్నవించుకోనా ...చిన్నకోరికా ...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.