ఆదివారం, జూన్ 21, 2015

ఓ నాన్న నీ మనసే...


ఈ రోజు ఫాదర్స్ డే కదా నాన్నలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలూ తెలుపుతూ తండ్రి ఔన్నత్యాన్ని తెలిపే ఓ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : ధర్మదాత (1970)
సంగీతం : తాతినేని చలపతిరావ్
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల, జయదేవ్

ఓ నాన్నా ఓ నాన్నా
ఓ నాన్న నీ మనసే వెన్న
అమృతం కన్నా అది ఎంతో మిన్న
ఓ నాన్నా ఓ నాన్నా

ముళ్ళ బాటలో నీవు నడిచావు
పూలతోటలో మమ్ము నడిపావు
ముళ్ళ బాటలో నీవు నడిచావు
పూలతోటలో మమ్ము నడిపావు
ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో
ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో
పరమాన్నం మాకు దాచి వుంచావు

ఓ నాన్న! నీ మనసే వెన్న
అమృతం కన్నా అది ఎంతో మిన్న
ఓ నాన్నా ఓ నాన్నా

పుట్టింది అమ్మ కడుపులోనైనా
పాలు పట్టింది నీ చేతిలోన
పుట్టింది అమ్మ కడుపులోనైనా
పాలు పట్టింది నీ చేతిలోన
ఊగింది ఉయ్యాలలోనైనా
ఊగింది ఉయ్యాలలోనైనా
నేను దాగింది నీ చల్లని ఒడిలోన..
చల్లని ఒడిలోన

ఓ నాన్న! నీ మనసే వెన్న
అమృతం కన్నా అది ఎంతో మిన్న
ఓ నాన్నా ఓ నాన్నా

ఉన్న నాడు ఏమి దాచుకున్నావు
లేనినాడు చేయి సాచనన్నావు
ఉన్న నాడు ఏమి దాచుకున్నావు
లేనినాడు చేయి సాచనన్నావు
నీ రాచగుణమే మా మూలధనము
నీ రాచగుణమే మా మూలధనము
నీవే మాపాలి దైవము
 
ఓ నాన్న! నీ మనసే వెన్న
అమృతం కన్నా అది ఎంతో మిన్న
ఓ నాన్నా ఓ నాన్నా


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

అలాగే నాన్న ప్రేమ గురించి ఈ ఇంగ్లీష్ పాట కూడా చాలా బాగుంటుంది మిస్ అవకుండా చూడండి.
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
ఈ రోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కూడా కనుక యోగ సాధకులందరుకు శుభాకాంక్షలు తెలుపుతూ అందరినీ యోగా ప్రాక్టీస్ చేసే దిశగా మోటివేట్ చేస్తున్న గవర్నమెంట్ ఇనిషియేటివ్ ను అభినందిస్తూ.. ప్రపంచ ప్రఖ్యాతినొందిన యోగా గురువులు బి.కె.ఎస్. అయ్యంగార్ గారి యోగ సాధన వీడియో ఎంబెడ్ చేస్తున్నాను. వారి ప్రతిభను చూసి అచ్చెరువొందని వారుండరేమో... అదే ప్రేరణతో మీరూ సాధన మొదలు పెట్టండి.

 

2 comments:

ఫాదర్స్ డే రోజున చక్కని పాట, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ వేణూజీ :-)

థాంక్స్ శ్రీకాంత్ గారు :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.