శుక్రవారం, జూన్ 19, 2015

ఒకే ఒక గులాబికై...

నేనంటే నేనే చిత్రం కోసం కోదండపాణి గారు స్వరపరచిన ఒక సరదా అయిన పాటను ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

చిత్రం : నేనంటే నేనే (1968) 
సంగీతం : ఎస్.పి.కోదండపాణి 
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ఒకే ఒక గులాబికై వాలిన తుమ్మెదలెన్నెన్నో 
ఒకే ఒక కోరిక రేపిన వింతలు ఎన్నెన్నో...

ఒకే ఒక గులాబికై వాలిన తుమ్మెదలెన్నెన్నో 
ఒకే ఒక కోరిక రేపిన వింతలు ఎన్నెన్నో...
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..

సిరి కోరి నను చేరి తెరచాటునా 
చెలికాడు ఆడేను దోబూచులే..
సిరి కోరి నను చేరి తెరచాటునా 
చెలికాడు ఆడేను దోబూచులే.. 
కన్నులకు తెలియనిది 
కమ్మని మనసుకు తెలియనులే 
అల్లరిలో ఆటలలో చల్లని మనసే దాగెనులే..
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..

ఒకే ఒక గులాబికై వాలిన తుమ్మెదలెన్నెన్నో 
ఒకే ఒక కోరిక రేపిన వింతలు ఎన్నెన్నో...

కోనేట కలహంస ఎటు ఈదినా
తీరాన నా చెంత చేరాలిలే.. 
తళతళలు దక్కవులే దారిన పోయే దానయ్య 
వెలలేని మక్కువలు నోచిన వాని ధనమయ్యా

ఒకే ఒక గులాబికై వాలిన తుమ్మెదలెన్నెన్నో 
ఒకే ఒక కోరిక రేపిన వింతలు ఎన్నెన్నో...
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.