సోమవారం, జూన్ 15, 2015

అవునా నీవేనా...

రుద్రమదేవి చిత్రం కోసం ఇళయరాజా గారి స్వరకల్పనలో సిరివెన్నెల గారు రాసిన పాట ఇది. ఈ పాట వీడియో ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు ఆడియో వినాలంటే క్రింది ఎంబెడెడ్ యూట్యూబ్ లింక్ లో వినవచ్చు.


చిత్రం : రుద్రమదేవి  (2015)
సంగీతం : ఇళయరాజా
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం :  హరిహరన్, సాధనా సర్గమ్

అవునా నీవేనా నే వెతుకుతున్న నిధివేనా
ఎదరున్నా ఎదలోనా నిదురించు కాంతివనుకున్నా
అవునా నిన్నేనా వెన్నంటు చెలిమివనుకున్నా
ఐనా ఇక పైనా వెంటాడు కలతవనుకోనా
 
నిను కలవనా... నను మరువనా
తహ తహల తపనలు తరిమెను తమవలనా
 
అవునా నీవేనా నే వెతుకుతున్న నిధివేనా
ఐనా ఇక పైనా వెంటాడు కలతవనుకోనా
 
గూడు వీడిపొయే గువ్వయింది మనసు
మేర మీరిపొయే ఏరయింది వయసు 
నిన్ను చూసి చూడగానే నేను ఏమయ్యానో
నువ్వు తాకీ తాకగానే కొత్తజన్మయ్యానో
లేని పోని మాయ ఏమిది 
తీయనైన గాయమైనది
హాయి కాని హాయే ఇది ఎదేవైనా
 
అవునా నీవేనా నే వెతుకుతున్న నిధివేనా
ఐనా ఇక పైనా వెంటాడు కలతవనుకోనా
 
ఇన్ని నాళ్లు లేదే నేడిదేమి బిడియం  
కాలు కదపనీదే వేడుకైన సమయం
తూలరాదే మెలుకాదే పిచ్చి బేలతనమా 
ఆప తరమా వెంట తరిమే పిల్లగాలి మహిమ
సింగమంటి పౌరుషం ఇలా
బెంగ పడితే పరువు కాదేల
జింక పిల్ల కళ్ళే ఇలా వేటాడేనా
 
అవునా నిన్నేనా వెన్నంటు చెలిమివనుకున్నా
ఐనా ఇక పైనా వెంటాడు కలతవనుకోనా
 
నిను కలవనా... నను మరువనా
తహ తహల తపనలు తరిమెను తమవలనా

అవునా నీవేనా నే వెతుకుతున్న నిధివేనా
ఐనా ఇక పైనా వెంటాడు కలతవనుకోనా

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.