రాక్షసుడు చిత్రం కోసం యువన్ శంకర్ రాజా స్వరపరచిన ఒక చక్కని మెలొడీ ఈ రోజు విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ వినవచ్చు.
చిత్రం : రాక్షసుడు (2015)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : కార్తీక్, చిన్మయి
నీ నీడవుతా నీ తోడవుతా
అడుగులో అడుగునై నీ నీడవుతా
నువ్వే నా ప్రాణం అన్నా
నీ నింగిలో రెండో జాబిలినై
నే నిలిచే వరమీవా వరమీవా
ఆమెను మరపించకపొయినా
తలపించేలా నీ గుండెల్లో కాపురముంటా
కానీ చెలియా కానీ చెలియా
ఆమెకు ఇచ్చినా హృదయాన్ని
నీకివ్వడానికి తడబాటు
కానీ చెలియా కానీ చెలియా
ఆమెతొ చేసిన పయనాలు
నీతో కావాలీ అలవాటు
నా నింగిలో ఒక తారగ వచ్చావులే
మెల మెల్లగా వెన్నెలై నిండావులే నా గుండెలో
నా నేలపై ఒక పువ్వై విచ్చావులే
మెల మెల్లగా తోటవై పూచావులే నా గుండెలో
చిరునవ్వై నువ్వొస్తే చిగురించా మళ్ళీ నేను
సిరిమువ్వై నా ఎదలో రవళించావే..
వచ్చింది నాకోసమే ఇలా అమవాస లోన వెన్నెలా
కానీ చెలియా కానీ చెలియా
ఆమెకు ఇచ్చినా హృదయాన్ని నీకివ్వడానికి...
నేనిన్ను ప్రేమించు ముందే
నీ ప్రేమంత నా చిట్టితల్లికి నువ్విచ్చావ్ ఇంకేమి
నే కోరకుండానే వరమిచ్చు దేవతల దిగివస్తివే
ఒడిలో చేర్చీ జోలాలి పాడీ
నువ్ సేద దీర్చగా నా గాయమారెలే
నీవే చెలియా నీవే చెలియా
నీవే నా మౌనం నీవేనా గానం
నీవే నా ధ్యానం
నీవే చెలియా నీవే చెలియా
నీవే నా హృదయం నీవే నా ప్రయణం
నీవే నా లోకం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.