బుధవారం, జూన్ 03, 2015

మాయ మాయ...

బాబా చిత్రం కోసం ఎ.ఆర్.రహ్మాన్ స్వరపరచిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బాబా (2002)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్ 
సాహిత్యం : శివగణేష్ 
గానం : ఉదిత్ నారాయణ్, సుజాత

మాయ మాయ మాయ అంతా మాయ
ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ
సంతోషి సంతోషి సంతోషి
నువ్ సంతోషంతో తేలే సన్యాసి
సంతోషి సంతోషి సంతోషి
నీ సంతోషం నీతోటి సహవాసి
 
మాయ మాయ మాయ అంతా మాయ
ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ
మాయ మాయ మాయ అంతా మాయ
ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ
పట్టి పట్టనట్టుగా ఉండి లేనట్టుగా
తామర ఆకుల్లో నీరల్లె నువ్వు
అంటి అంటక ఉండు
మాయ మాయ మాయ అంతా మాయ
ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ

వాసన అందం వాడితే అంతం
పూవుల చందం మనుషుల జన్మం
భువిలో మనకు శాశ్వతమేది
పవళింపు వరకు స్వతంత్రమేది
విషయం చెపితే అతనిది సోది
విషమం పేరే రాజకీయ వాది
అందులో ఏమున్నది అది ఆ పదవుల వ్యాధి
మనిషికి కాలు చెయ్యే మరవని నేస్తాలయ్యే
సంద్రాల పై నూనె బిందువు మల్లే
నువ్ అంటీ అంటక ఉండు

మాయ మాయ మాయ అంతా మాయ
ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ
మాయ మాయ మాయ అంతా మాయ
ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ

గాలమ్మా గాలమ్మా నా చెలునికిదీ తెలుపమ్మ
కన్నీరే కన్నీరు నా మనసే చదువమ్మ
మాయల్లె ఛాయల్లె కన్నె వలపు ఏనాడూ మారదులే
ప్రాణంలో ప్రాణంగా ఉన్న సొగసు వసి వాడి పోనిదిలే
గాలమ్మా గాలమ్మా నా చెలునికిదీ తెలుపమ్మ

పట్టి పట్టనట్టుగా (పట్టే రసపట్టుగా)
ఉండి లేనట్టుగా (గుచ్చి లేటెస్టుగా)
తామర ఆకుల్లో నీరల్లె నువ్వు అంటి అంటక ఉండు
తామర ఆకుల్లో నీరల్లె నువ్వూ నాతో జంటగా ఉండు

సంతోషి సంతోషి సంతోషి నువ్వు నా జంటై వెంటొస్తే సంసారి
సంతోషి సంతోషి సంతోషి నువ్వు తాకేస్తే అవుతాలె నీ దాసి

మాయ మాయ మాయ అంతా మాయ
ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ
మాయ మాయ మాయ అంతా మాయ
ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ

పట్టి పట్టనట్టుగా ఉండీ లేనట్టుగా
తామర ఆకుల్లో నీరల్లె నువ్వు అంటి అంటక ఉండు
తామర ఆకుల్లో నీరల్లె నువ్వూ నాతో జంటగా ఉండు


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.