మంగళవారం, జూన్ 16, 2015

కానుకే బొండుమల్లి...

ఉత్తమ విలన్ చిత్రం కోసం జిబ్రన్ స్వరపరచిన ఒక చక్కని మెలొడి ఈరోజు విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా యూట్యూబ్ జ్యూక్ బాక్స్ లో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : ఉత్తమ విలన్ (2015)
సంగీతం : జిబ్రన్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : పద్మలత

కానుకే బొండుమల్లి కైవసం కౌగిలీ
ఆకలీ దాహమే ఆరాధనం ఆరాధనం

ఆఆఅ..కానుకే బొండుమల్లీ కైవసం కౌగిలీ
ఆకలీ దాహమే ఆరాధనం ఆరాధనం

కానుకే బొండుమల్లి కైవసం కౌగిలీ

విల విలా విరహమే అలలయ్యే కడలినై
ప్రణయమే పయనమై పరుగిడే పడవ నై
కలను వెతికి కరిగి మరిగా
మెత్తని మైనపు దేహమై
తలపు వీణను మీటెను తాపం
మాయా మన్మధుని పూల శరమై

కానుకే... ఆఆ.. కైవసం.... ఆఆ..
ఆకలీ దాహమే ఆరాధనం ఆరాధనం

మాటలే వలయునా మనసులే పెనవేయగా
మౌనమే చాలదా మోహమే కలబోయగా
సరస కాలపు సంగీత తాళం
చెంపన చిటెకలు వేయించవా
శృంగార శిఖరపు అంచులు చేరగ
నాతో ఉప్పొంగెడి ఊపిరి కావా

కానుకే బొండుమల్లి కైవసం కౌగిలీ
ఆకలీ దాహమే ఆరాధనం ఆరాధనం

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.