సోమవారం, జూన్ 08, 2015

ఏమయ్యిందంటే...

రమేష్ నాయుడు గారి స్వర సారధ్యంలో బాలు గారు సుశీల గారు ఒక పాటలా కాకుండా ఆటలా ఆడుకుంటూ పాడిన ఒక అందమైన సినారె గారి రచనను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మంగళ తోరణాలు (1979)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ఏమయ్యిందంటే..ఆ ! అయిందంటే..
ఏమయ్యిందంటే నే చెప్పలేను...
ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ..

ఏమయ్యిందంటే నే చెప్పలేను..
ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ...

పదములేమో పద పదమంటుంటే..
బిడియమేమో బిడియ పడుతుంటే...
నిలవని నా చేయి కలవర పడిపోయి...
నిలవని నా చేయి కలవర పడిపోయి...
కొసపైటతో గుసగుస లాడుతుంటే
హ హ హ.. ఆ పైన ?..

ఏమయ్యిందంటే నే చెప్పలేను....
ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ..
 
ఏమయ్యిందంటే నే చెప్పలేను..
ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ...

వేచిన పానుపు విసుగుకోగా.. 
వెలిగే పడకిల్లు మసకైపోగా..
పెదవులు పొడివడి.. మాటలు తడబడి
పెదవులు పొడివడి.. మాటలు తడబడి
తనువులు తమే పలకరించుకోగా...
హా.. ఆపైనా ?

హు.. ఏమయ్యిందంటే నే చెప్పలేను 
ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ...ఊ..

ఏమయ్యిందంటే నే చెప్పలేను...
ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ...

ఉదయకిరణాలు తలుపు తడుతుంటే
ఒదిగిన హృదయాలు వదలమంటుంటే
వేళమించెనని పూలపాన్పు దిగీ..
వేళమించెనని పూలపాన్పు దిగి..
కదిలే నిన్ను కౌగిట పొదువుకుంటే...
ఆ పైనా?...
 
ఏమయ్యిందంటే.. హు హు హూ హూ 
ఏమీ కాలేదంటే..హు..హు...
లా ల ల లా ల..
నే చెప్పలేనూ..
హ హ హ లా లా ల లాల లాలా ..
నేనొప్పుకోనూ.. 


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.