గురువారం, జూన్ 18, 2015

చల్లగాలి తాకుతున్న...

యెవడే సుబ్రహ్మణ్యం సినిమా కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఒక చక్కని మెలోడీ ఈ రోజు విందాం. ఈ  పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఎవడే సుబ్రహ్మణ్యం
సంగీతం : రాధన్ (ఒరిజినల్ సాంగ్: ఇళయరాజా) 
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : సెంథిల్, రిషిత

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా
ఎందుకంట ఇంత దగా, నిన్న మొన్న లేదుకదా?
ఉండి ఉండి నెమ్మదిగా నన్ను ఎటో లాగుతుందా
పదమే తప్పించుకోలేననీ తోచేట్టుచేస్తున్నదా

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా

ఎవరో అన్నారనీ మారవే నాలో ఆశలూ
ఎవరేం అన్నారనీ పొంగెనే ఏవో ఊహలూ
ఎవరో అన్నారనీ మారవే నాలో ఆశలూ
ఎవరేం అన్నారనీ పొంగెనే ఏవో ఊహలూ
తీరం తెలిశాకా ఇంకా దారిని మార్చానా
దారులు సరియైనా వేరే తీరం చేరానా
నడకలు నావేనా, నడిచేదీ నేనేనా

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా

ఎంతగా వద్దంటున్నా ఆగదే ఆత్రం ఏమిటో
ఇంతగా పొంగేటంత అవసరం ఏమో ఎందుకో
ఐనా ఏమైనా ఎద నా చెయి జారిందే..
ఎపుడో ఏనాడో ప్రేమే నేరం కాదందీ
చెలిమే ఇంకోలా చిగురిస్తూ ఉందటే

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా

2 comments:

the original song is so better. except for the first line, చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా, rest of the lyrics is ordinary. the tamil song was sung by s janaki and ilayaraja. picturized superbly by nazar in the film avatharam. great tune.

థాంక్స్ అజ్ఞాత గారూ.. ఒరిజినల్ ని బీట్ చేయగల రీమిక్స్ లు అతి తక్కువే కదండీ.. ఒక మంచి ట్యూన్ ని తెలుగులో పాడుకోగలుగుతున్నందుకు సంతోషం అంతే.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.