గురువారం, జూన్ 04, 2015

ముదినేపల్లి మడిచేలో...

జెంటిల్మాన్ సినిమా కోసం ఎ.ఆర్.రెహ్మాన్ స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జెంటిల్‌మెన్ (1993)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
రచన : రాజశ్రీ
గానం : సాహుల్ హమీద్, స్వర్ణలత, మాల్గాడి శుభ

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
బుట్ట మీద బుట్టపెట్టి బుగ్గ మీద చుక్కపెట్టి
వాగల్లే నడిచావే
నీ బుట్టలోన పువ్వులన్నీ గుట్టులన్నీ రట్టుచేసి
నన్నీడ పిలిచేనే

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
పల్లి పల్లి ముదినేపల్లి
పల్లి పల్లి ముదినేపల్లి

కాటుక కళ్ల వాడల్లో
కట్టుకుంటా గుడిసెంటా
పసుపుతాడు పడకుండా
ఆగడాలే వద్దంటా
చింతపల్లి చిన్నోణ్ని
చూడు నీకు వరసంటా
వరస కాదు నాకంట
మనసు ఉంటే చాలంటా

పగలు రేయి... నీతో ఉంటా
ఉన్నావంటే... అది తప్పంట
కలిసి వస్తే వెన్నెలమాసం
చెయ్యలి జాగారం

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూశావో నెల తప్పేనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నువ్వు ఓరకంట చూశావో నెల తప్పేనమ్మా
బుట్టమీద బుట్టపెట్టి నేను పువ్వులమ్ముతుంటే
కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు
గాలాలే యేస్తావే

 
తమలపాకు తడిలోన
పండెనే నీ నోరంటా
నోటి పంట కాదంటా
పాడిపంట చూడంటా
 
నాకు నువ్వే తోడుంటే
సంబరాలే నట్టింట
ఆశపడిన మావయ్యది
అందమైన మనసంట
 
అందం చందం నీకే సొంతం
వెన్నోల్లోనే యేస్తా మంచం 
పైరగాలుల పందిరిలోన
కరిగిపోదాం మనం

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూశావో నెల తప్పేనమ్మా
బుట్టమీద బుట్టపెట్టి నేను పువ్వులమ్ముతుంటే
కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు
గాలాలే యేస్తావే

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.