బుధవారం, జూన్ 10, 2015

నే తొలిసారిగా...

సంతోషం చిత్రం కోసం ఉష గానం చేసిన ఓ సిరివెన్నెల రచనను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సంతోషం (2002)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఉష

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా
నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా
తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధుర గానమో
తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై
అందవా.. స్నేహమా..

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా
నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా

రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా..
ఎక్కడ వాలను చెప్పునువే సావాసమా..
హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా..
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా..
నడకలు నేర్పిన ఆశవు కద
తడబడనీయకు కదిలిన కధ
వెతికే మనసుకు మమతే.. పంచుమా..
 
నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా
నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా

ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా..
అమృతమనుకుని నమ్మటమే ఒక శాపమా..
నీ ఒడి చేరిన ప్రతి మదికీ బాధే ఫలితమా..
తీయని రుచిగల కటికవిషం నువ్వే సుమా..
పెదవులపై చిరునవ్వుల దగా
కనబడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా

నీ ఆటేమిటో.. ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో.. ఏ జంటకీ చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా.. తీరులో ప్రళయమా..
పంతమా.. బంధమా..

నీ ఆటేమిటో.. ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో.. ఏ జంటకీ చూపవు కదా


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.