మల్లిఖార్జున్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మల్లిఖార్జున్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, సెప్టెంబర్ 17, 2020

గున్నమావి కొమ్మ మీద...

నువ్వు నేను చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : నువ్వు నేను (2001)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : కులశేఖర్  
గానం : మల్లిఖార్జున్, ఉష 

గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక
ఎవరూ లేని ఏకాకంట చక్కని గోరింక
అంతా ఉన్నా ఒంటరి పాపం వన్నెల రాచిలక
మమతలు తెలియని ఆ గోరింకకు చిలకే తోడంట
మనసులు కలిసిన ఆ ప్రేమికులు ఒకరికి ఒకరంట

గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక

గోరువంక తన గుండె గూటిలో చిలకని దాచింది
రామచిలక ఆ గోరువంకనే కనుపాపనుకుంది
కాటుకెంత అడ్డు వచ్చినా కంటి చాటు స్వప్నమాగునా
చేతులెంత అడ్డు పెట్టినా గుండె మాటు సవ్వడాగునా
కటిక హృదయాలు ఏమనుకున్నా ప్రేమొక వరమేగా

గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక

పాడులోకం ఆ జంటను చూసి కత్తులు దూసింది
కక్ష గట్టి ఆ మనసులనిట్టే దూరం చేసింది
పంజరాలలోన పెట్టినా రామచిలక మూగబోవునా
హోరుగాలి ఎంత వీచినా ప్రేమ దీపమారిపోవునా
బ్రహ్మ రాతల్ని మార్చాలంటే మనుషుల వశమేనా

గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక
ఎవరూ లేని ఏకాకంట చక్కని గోరింక
అంతా ఉన్నా ఒంటరి పాపం వన్నెల రాచిలక
మమతలు తెలియని ఆ గోరింకకు చిలకే తోడంట
మనసులు కలిసిన ఆ ప్రేమికులు ఒకరికి ఒకరంట
నువ్వు నేనంటా
 

 

మంగళవారం, నవంబర్ 21, 2017

పట్టుదలతో చేస్తే సమరం...

సంబరం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సంబరం (2003)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : మల్లికార్జున్

పట్టుదలతో చేస్తే సమరం
తప్పకుండ నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
నీ ధైర్యం తోడై ఉండగా
ఏ సాయం కోసం చూడకా
నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా
ఏ నాడూ వెనకడుగేయకా
ఏ అడుగూ తడబడనీయకా
నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా

పట్టుదలతో చేస్తే సమరం
తప్పకుండ నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా

ఇష్టం ఉంటే చేదు కూడా తియ్యనే
కష్టం అంటే దూది కూడా భారమే
లక్ష్యమంటూ లేని జన్మే దండగా
లక్షలాది మంది లేరా మందగా
పంతం పట్టీ పోరాడందే
కోరిన వరాలు పొందలేవు కదా

పట్టుదలతో చేస్తే సమరం
తప్పకుండ నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా

చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే
చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే
ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా
ఎక్కలేని కొండనేదీ లేదురా
నవ్వే వాళ్ళు నివ్వెరపోగా
దిక్కులు జయించి సాగిపోర మరి

పట్టుదలతో చేస్తే సమరం
తప్పకుండా నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
నీ ధైర్యం తోడై ఉండగా
ఏ సాయం కోసం చూడకా
నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా
ఏ నాడూ వెనకడుగేయకా
ఏ అడుగూ తడబడనీయకా
నీ గమ్యం చేరేదాకా ధూసుకుపోరా సోదరా

పట్టుదలతో చేస్తే సమరం
తప్పకుండ నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
 

ఆదివారం, నవంబర్ 19, 2017

సాహసం శ్వాసగా సాగిపో...

ఒక్కడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఒక్కడు (2003)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : మల్లిఖార్జున్

సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా

ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకీ..ఈ..ఈ
సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకీ..ఈ..ఈ
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలూ...ఉ..ఉ...

సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా

కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో
పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలూ..ఊ..ఊ...

సాహసం శ్వాసగా.. సాగిపో సోదరా..
సాగరం ఈదటం తేలికేం కాదురా

 

శుక్రవారం, మే 08, 2015

కనులు తెరిచినా...

ఆనందం చిత్రం కొసం దేవీశ్రీప్రసాద్ స్వరపరచిన ఒక చక్కని సిరివెన్నెల రచనను ఈ రోజు తలచుకుందాం. వీడియో యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు, ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆనందం (2001)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : మల్లికార్జున్, సుమంగళి

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా
ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా
 
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా

 
పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది
నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది
 
ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది
అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది
దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కాని ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది
నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని
 
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా

 
ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది
నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది
నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే
ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మది
 

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా 
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా
ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా

మంగళవారం, మే 20, 2014

నీ నవ్వుల తెల్లదనాన్ని...

మణిశర్మ సంగీత దర్శకత్వంలో చంద్రబోస్ రచనతో వచ్చిన ఈపాట ప్రియురాలిని పొగడడంలో పీక్స్ కి వెళ్ళి పోతుంది, దానికి తోడు మంచి మెలోడీ కూడా అవడంతో విన్నవెంటనే ఆకట్టుకుంటుంది. ఈ సినిమా విడుదలైనపుడు నేను చాలా ఎక్కువగా విన్న ఈపాట మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఆది (2002)
సంగీతం : మణి శర్మ
రచన : చంద్రబోస్
గానం : మల్లికార్జున్, సునీత

నీ నవ్వుల తెల్లదనాన్ని
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
నీ కోకను సీతాకోక నీ పలుకులు చిలకల మూక
నీ చూపును చంద్రలేఖ నీ కొంగును ఏరువాక
బదులిమ్మంటు బ్రతిమాలాయి ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
అసలివ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... 


నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...

నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైనా ఇవ్వద్దు
నా వైపే మొగ్గిన నీకైతే అవి మొత్తం ఇవ్వచ్చు
నీ బాసల్లోని తియ్యదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు
నాకోసం వేచిన నీకైతే అది రాసిగా ఇవ్వచ్చు
భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు
భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు
నీకే మొక్కే నాకే ఇవ్వచ్చూ... 


నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే
అరువడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...

నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు
మరి నాకై పుట్టిన నీకైతే అది పూర్తిగ ఇవ్వచ్చు
నీ భారం మోసే అదృష్టాన్నే భూమికి సైతం ఇవ్వద్దు
నేనంటే మెచ్చిన నీకైతే అది వెంటనే ఇవ్వచ్చు
నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు
నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు
నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చూ... 


నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... 


నా వాకిట ముగ్గులు నీకే నా దోసిట మల్లెలు నీకే...
నా పాపిటి వెలుగులు నీకే నా మాపటి మెరుపులు నీకే
ప్రాయం ప్రణయం ప్రాణం నీకే
ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా...
బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా...


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.