శుక్రవారం, మే 08, 2015

కనులు తెరిచినా...

ఆనందం చిత్రం కొసం దేవీశ్రీప్రసాద్ స్వరపరచిన ఒక చక్కని సిరివెన్నెల రచనను ఈ రోజు తలచుకుందాం. వీడియో యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు, ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆనందం (2001)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : మల్లికార్జున్, సుమంగళి

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా
ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా
 
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా

 
పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది
నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది
 
ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది
అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది
దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కాని ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది
నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని
 
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా

 
ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది
నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది
నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే
ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మది
 

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా 
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా
ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా

1 comments:

యెలా ఆగుతుంది..ఓ పక్క ప్రేమ గుండెని కమ్మేస్తుంటే..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.