మెరుపు కలలు చిత్రం కోసం రహ్మాన్ స్వరపరచిన ఒక హుషారైన పాట ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : మెరుపుకలలు (1997)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : వేటూరి
గానం : శ్రీని, ఉన్నిమీనన్, చిత్ర
ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా
మచిలీపట్నం మామిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట
నా కంటి కెంపులలకా
నా రెక్క నునుపు తళుకా
చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి
ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా
మెట్టదారి ఇదే బండికి వాలు ఇదే ఓ పొంకాల పోరి ఒకతి
పోరి కట్టుకున్న చీర పొగరు చూశా వాన విల్లు వర్ణం ఆహా..
మనసున మల్లె వాన చింది చింది సుధ చిలికే నయగారం
మరి ఎద వాలి గిల్లి కొత్త తాళమడిగినదే చెలగాటం
ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా
తందానా తందానా తాకి మరి తందానా
ఏ తాళం వాయించాడే
తందానా తందానా పాట వరస తందానా
ఏ రాగం పాడిస్తాడే
సిరి వలపో మతిమరుపో అది హాయిలే
సిరి పెదవో విరి మధువో ప్రియమేనులే
తందానా తందానా కన్నె ప్రేమ తందానా
వచ్చిపోయె వాసంతాలే
మనసిజ మల్లెవీణ సిగ్గు సిగ్గు లయలొలికే వ్యవహారం
అది అలవాటుకొచ్చి గుచ్చి చూసి మనసడిగే చెలగాటం
ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా
మచిలీపట్నం మామిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట
నా కంటి కెంపులలకా నా రెక్క నునుపు తళుకా
చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి
తందానా తందానా ఊసుకనుల తందానా
ఊరించే తెట్టు తేవె
తందానా తందానా పాటకొక తందానా
చెవి నిండా గుమ్మత్తేలే
వయసులలో వరసలలో తెలియందిదే
మనసుపడే మౌన సుఖమే విరహానిదే
తందానా తందానా మేఘరాగం తందానా
వచ్చె వచ్చె వానజల్లే
మధురస మాఘ వేళ కన్నుగీటి కథ నడిపే సాయంత్రం
తొలిచెలి గాలి సోలి కొత్త తోడు కలిసినదే చెలగాటం
ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా
మచిలీపట్నం మామిడి చిగురులో
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా
మా చిలక మా చిలక మా చిలక...
ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.