శనివారం, మే 30, 2015

రాజాధి రాజాను...

ఆ ఒక్కటీ అడక్కు చిత్రం కోసం ఇళయరాజా స్వరపరచిన ఒక సరదా అయిన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆ ఒక్కటి అడక్కు(1993)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : S.P.బాల సుబ్రహ్మణ్యం

రాజాధి రాజాను నేనురా
ఇక వైజాగు వైభోగం చూడరా
సరదాల సామ్రాట్టు నేనురా
ఇక సర్కారు సీడెడ్ నావిరా
జాక్పాటే నేను కొట్టేస్తా
జైపూరే నేను పట్టేస్తా
టాటాతో మాట కలిపేస్తా
బిర్లాకే బీటు వేసేస్తా

రాజాధి రాజాను నేనురా
ఇక వైజాగు వైభోగం చూడరా
సరదాల సామ్రాట్టు నేనురా
ఇక సర్కారు సీడెడ్ నావిరా

వెండి రేకు వెడ్డింగ్ కార్డు
చెల్లి పెళ్ళికి వేస్తానురా
గోల్డ్ ఆకు పందిళ్ళు వేస్తే
రాజభవనే విడిదిల్లురా
పాటియాల రాజు వస్తే
భళా ప్లాటినాల పంచలిస్తా
పాదరసం కాళ్ళు కడిగి
పెళ్ళు పెళ్లుమంటూ పెళ్లి చేస్తా
రాజమాత కంట రత్నాల చినుకులంట
మా చెల్లి పెళ్లి కట్నం
నా స్విస్సు బ్యాంకు ఖాతా
అరె కింగాది కింగులంతా డంగయ్యే పెళ్లి చేస్తా

రాజాధి రాజాను నేనురా
ఇక వైజాగు వైభోగం చూడరా
సరదాల సామ్రాట్టు నేనురోయ్
ఇక సర్కారు సీడెడ్ నావిరా

జాక్పాటే నేను కొట్టేస్తా
జైపూరే నేను పట్టేస్తా
టాటాతో మాట కలిపేస్తా
బిర్లాకే బీటు వేసేస్తా

రాజాధి రాజాను నేనురా
ఇక వైజాగు వైభోగం చూడరా
సరదాల సామ్రాట్టు నేనురా
ఇక సర్కారు సీడెడ్ నావిరా

జాతిసొత్తు ఈ స్టీలు ప్లాంట్ రాసి ఇస్తా రారండిరో
కప్పలల్లె మూగేటి మీకు షిప్ యార్డే ఇస్తానురో
రత్నాల రాసులెన్నో రాయల్లా రాసి ఇస్తా
రంభంటి ఊర్వశొస్తే రాయల్ లా లవ్వు చేస్తా
గంటకొక్క కోటి మా అమ్మ రామకోటి
లక్ష్మిదేవితోనే నాకుంది లావాదేవి
అరె ఎంపరర్ల కొండల్లో ఎవరెస్టు లాంటి వాణ్ణి

రాజాధి రాజాను నేనురా
ఇక వైజాగు వైభోగం చూడరా
సరదాల సామ్రాట్టు నేనురా
ఇక సర్కారు సీడెడ్ నావిరా

జాక్పాటే నేను కొట్టేస్తా
జైపూరే నేను పట్టేస్తా
టాటాతో మాట కలిపేస్తా
బిర్లాకే బీటు వేసేస్తా

రాజాధి రాజాను నేనురా
ఇక వైజాగు వైభోగం చూడరా
సరదాల సామ్రాట్టు నేనురా
ఇక సర్కారు సీడెడ్ నావిరా


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.