తెలుగు సినిమాలకు ఫ్యాక్షన్ కథలను పరిచయం చేసిన "ప్రేమించుకుందాంరా" చిత్రంలో అప్పటి కుర్రకారును ఒక ఊపు ఊపేసిన అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ నుండి డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ప్రేమించుకుందాంరా (1997)
సంగీతం : మహేష్ మహదేవన్
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, అనురాధా శ్రీరామ్
సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వనవాసినీ కావేరి
పెదవి తాకి స్వాతిముత్యం పగడమయ్యిందా
తనువు తాకి శ్వేతపుష్పం అరుణమయ్యిందా
నీ ఒడి మన్మధ యాగ సీమ
నీ సరి ఎవ్వరు లేరే భామ
నీ తోనే పుట్టింది ప్రేమా
కన్నె శకుంతలే నీవా కావ్య సుమానివే నీవా
చల్లని వెన్నెల హాయిని వివరించేదెలా
వెచ్చని ఊహల వీణని వినిపించేదెలా
వాత్సాయన వనవాసినీ కావేరి
సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా
సొగసు భారమోపలేక నడుము చిక్కిందా
జాలిగొన్న జాణతనమే జఘనమయ్యిందా
తుమ్మెద ఎరగని తేనె పువ్వా
సౌందార్యానికి తావి నువ్వా
ప్రియమార దరిచేరరావా
సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వనవాసినీ కావేరి
2 comments:
Very beautiful song and few lines like పెదవి తాకి స్వాతిముత్యం పగడమయ్యిందా, సొగసు భారమోపలేక నడుము చిక్కిందా are really good. Thanks for sharing.
$iddharth
థాంక్స్ సిద్దార్థ్ గారు అవునండీ కొన్ని లైన్స్ బావుంటాయ్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.