మంగళవారం, మే 05, 2015

కోయిల పిలుపే...

రమేష్ నాయుడు గారి స్వరకల్పనలోని ఒక చక్కని పాట ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అందాల రాశి (1980)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

కోయిల పిలుపే కోనకు మెరుపు..
మాయని వలపే మనసుకు మెరుపు...ఊ..
 
కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...
 
ఆఆ...అహహా...ఆ..ఆ..అహహా..ఆ..
ఆఆ...అహహా...ఆ..ఆ..అహహా..ఆ..

నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ...
గాలి అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ...
నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ...
గాలి అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ...
పెదవులకెంత ఆశ... ఎంత ఆశ.... ఎంత ఆశా...
పెదవులకెంత ఆశ... ఎంత ఆశ.... ఎంత ఆశా...
పదే పదే పదే పదే ఒదిగి ఉండాలని...

కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...
 
కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...
 
కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ...
వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ...
కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ...
వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ...
హృదయం కోరుతుంది... కోరుతుంది... కోరుతుంది...
హృదయం కోరుతుంది... కోరుతుంది... కోరుతుంది... 
ఇలా ఇలా ఇలా ఇలా కలిసి ఉండాలనీ....

కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...

 
కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...


1 comments:

వసంతం, కోయిలా లేని ప్రేమని ఊహించ లేము..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.